ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ కు  మహేష్ బాబు ఫిదా !!!

మహర్షి మూవీపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు

Last Updated : May 15, 2019, 04:57 PM IST
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ కు  మహేష్ బాబు ఫిదా !!!

మహర్షి మూవీ వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికపై తన స్పందన తెలియజేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన తాజా ట్వీట్ పై హీరో మహేష్ బాబు స్పందించారు. వెంకయ్యనాయుడిని ఉద్దేశించి మట్లాడుతూ.. సార్.. మీ లాంటి వ్యక్తి మహర్షి మూవీని అభినందిచడాన్ని నాతో పాటు చిత్ర యూనిట్ గౌరవంగా భావిస్తున్నాము. వాస్తవంగా చెప్పాలంటే మాకు ఇంత కుమించిన ప్రశంస మరొకటి ఉండదనుకుంటున్నాను.. మహర్షి లాంటి మరెన్నో మంచి సినిమాలు చేయడానికి మీ మాటలు మాకు స్ఫూర్తి కలిగిస్తున్నాయి. మా మహర్షి టీమ్ తరఫున చెబుతున్నా... మీ స్పందనకు మేమందరం ఫిదా అయ్యాం ..థాంక్యూ సర్ అంటూ మహేష్ బాబా ట్వీట్ చేశారు

 

మహర్షి మూవీపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా అంటూ చిత్ర యూనిట్ ను అభింనందిస్తూ వెంకయ్య ట్వీట్ చేశారు. తాజా ట్వీట్ పై మహేష్ బాబు ఇలా బదులిచ్చారు

Trending News