Mahesh Babu`s biopic talk : మహేష్ బాబు బయోపిక్ టాక్.. సూపర్ స్టార్ రిప్లై

మహేష్ బాబు రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఆయన అభిమానులకు ఒక్కసారిగా ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్తుంది కదా!! ఒకవేళ మహేష్ బాబు బయోపిక్ సెట్స్ పైకి వెళ్తే.. ఆ సినిమాకు ఏం టైటిల్ పెడతారు ? టైటిల్ రోల్ ఎవరు ప్లే చేస్తారు ? ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే ఆలోచనలన్నీ ఒక్కసారిగా అభిమానుల బుర్రను తొలిచేయడం గ్యారెంటీ.

Last Updated : Feb 18, 2020, 07:20 PM IST
Mahesh Babu`s biopic talk : మహేష్ బాబు బయోపిక్ టాక్.. సూపర్ స్టార్ రిప్లై

మహేష్ బాబు రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఆయన అభిమానులకు ఒక్కసారిగా ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్తుంది కదా!! ఒకవేళ మహేష్ బాబు బయోపిక్ సెట్స్ పైకి వెళ్తే.. ఆ సినిమాకు ఏం టైటిల్ పెడతారు ? టైటిల్ రోల్ ఎవరు ప్లే చేస్తారు ? ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే ఆలోచనలన్నీ ఒక్కసారిగా అభిమానుల బుర్రను తొలిచేయడం గ్యారెంటీ. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేష్ బాబుకు ఇవే ప్రశ్నలు ఎదురుకాగా.. ఆయా ప్రశ్నలకు టాలీవుడ్ సూపర్ స్టార్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. తన జీవితం ఎంతో బోరింగ్‌గా, సింపుల్‌గా ఉంటుందని.. అందుకే తన జీవితంపై బయోపిక్ హిట్ అవదనే అనుకుంటానని ఎప్పటిలాగే మహేష్ బాబు చాలా సింపుల్‌గా సమాధానం ఇచ్చాడు. 

మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా మూవీ సెట్ ఇన్సిడెంట్ ఉందా అని అడగ్గా.. మూవీ సెట్ అని కాదు కానీ.. 2001లో మురారి సినిమా విడుదలైనప్పుడు నాన్న గారితో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌కి వెళ్లాం. అక్కడ సినిమా చూసిన తర్వాత నాన్న గారు నా భుజం తట్టి నన్ను దగ్గరికి తీసుకున్న తీరును తాను ఎప్పుడూ మర్చిపోలేను అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. 

పర్‌ఫెక్ట్ డేటింగ్ ఐడియా గురించి చెబుతూ.. తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఒక మంచి సినిమా చూడటమే తన దృష్టిలో పర్‌ఫెక్ట్ డేటింగ్ ఐడియా అని తెలిపాడు. 

భరత్ అనే నేను అనే సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషించి ఆడియెన్స్‌‌‌ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, నిజంగానే ఒక వేళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, మీరు మొదటిగా చేసే పని ఏంటని అడగ్గా- తనకేమీ తెలియదని చెప్పిన మహేష్ బాబు.. రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.  

టాలీవుడ్ నటులతో రోడ్ ట్రిప్‌కి వెళ్లాల్సి వస్తే అందుకు ఎవరిని ఎంచుకుంటారని అడగ్గా- చరణ్, తారక్, చిరంజీవి గారు అని మహేష్ బాబు చెప్పినట్టుగా టైమ్స్ఆఫ్ఇండియా.ఇండియాటైమ్స్.కామ్ కథనం పేర్కొంది. మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ సరిలేరు నీకెవ్వరు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవగా ప్రస్తుతం ఆయన తన తర్వాతి చిత్రం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, అంతకంటే ముందుగా కొంత విశ్రాంతి తీసుకోవాలని మహేష్ బాబు భావిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News