2.0 మేకింగ్ వీడియో: రజినీకాంత్‌కి ఆ గెటప్ ఎలా వేశారో తెలుసా ?

Last Updated : Nov 17, 2018, 08:08 PM IST
2.0 మేకింగ్ వీడియో: రజినీకాంత్‌కి ఆ గెటప్ ఎలా వేశారో తెలుసా ?

శంకర్ తెరకెక్కించిన మరో భారీ చిత్రం 2.0 సినిమా నవంబర్ 29న విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిసారించింది. ఇటీవలే రిలీజైన ఆ చిత్ర ట్రైలర్‌కి భారీ స్పందన కనిపించింది. గతంలో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ పోషించిన పాత్ర ఎన్నో సవాళ్లతో కూడుకున్నది అని ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజినీకాంత్ లుక్ మేకింగ్ వీడియో విడుదల చేసింది. ఈ సినిమాలో రజినికాంత్ ఆ విధంగా కనిపించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎలా ఆ గెటప్ వేయగలిగాడు అనే విషయాలు క్లుప్తంగా తెలియాలంటే.. ఇదిగో ఈ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.

Trending News