ముద్దు పెడితే.. తాట తీస్తా: మహిళా రిపోర్టర్

ఈ మధ్యకాలంలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ లైవ్ కవరేజ్ చేస్తున్న ఓ విదేశీ మహిళా రిపోర్టర్‌కి ఓ ఆగంతకుడు వచ్చి ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా ముద్దు పెట్టిన సదరు వ్యక్తిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.

Last Updated : Jun 26, 2018, 06:24 PM IST
ముద్దు పెడితే.. తాట తీస్తా: మహిళా రిపోర్టర్

ఈ మధ్యకాలంలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ లైవ్ కవరేజ్ చేస్తున్న ఓ విదేశీ మహిళా రిపోర్టర్‌కి ఓ ఆగంతకుడు వచ్చి ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా ముద్దు పెట్టిన సదరు వ్యక్తిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా మళ్లీ ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే ఈ సారి తనను ముద్దు పెట్టబోతున్న వ్యక్తి నుండి తప్పించుకొని ఆ సదరు రిపోర్టర్ తిట్ల దండకం అందుకుంది.

మహిళలను గౌరవించడం నేర్చుకోమని హితవు పలికింది. లైవ్‌‌‌లోనే తనను ముద్దు పెట్టుకోబోయిన వ్యక్తిని దుర్భాషలాడింది. అతని సంస్కారాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం డేరింగ్ చేసిన ఆ మహిళా రిపోర్టరు పట్ల నెటిజన్లు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్రెజిల్‌కు చెందిన ఆ మహిళా రిపోర్టర్ పేరు జూలియా గిమారాస్. అయితే తన దేశంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదర్కోలేదని పేర్కొంది.  రష్యా లాంటి దేశాలలో ఇలాంటి వేధింపుల బారిన పడినట్లు కూడా జూలియా తెలిపింది. 

Trending News