karthikeya 2: కార్తికేయ 2 సినిమా విజయానందం కంటే.. బాధే ఎక్కువగా ఉంది: అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran about karthikeya 2 movie. సక్సెస్‌ మీట్‌ సందర్భంగా కార్తికేయ 2 హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 17, 2022, 12:07 PM IST
  • కార్తికేయ 2 సినిమా విజయానందం కంటే
  • బాధే ఎక్కువగా ఉంది
  • కార్తీకేయ 2పై అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు
karthikeya 2: కార్తికేయ 2 సినిమా విజయానందం కంటే.. బాధే ఎక్కువగా ఉంది: అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran interesting comments on karthikeya 2 movie in success meet: టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన సినిమా 'కార్తికేయ 2'. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్‌ 13న రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తీకేయ 2 మంచి విజయం అందుకోవడంతో చిత్ర యూనిట్ మంగళవారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది.

సక్సెస్‌ మీట్‌ సందర్భంగా కార్తికేయ 2 హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు. 'నేను ఎప్పుడూ స్టేజ్ మీద ఇంత టెన్షన్ పడలేదు. ఈ రోజు మాత్రం స్టేజ్ పైకి వస్తుండగానే.. షివరింగ్ మొదలైంది. కార్తికేయ 2 మంచి విజయం అందుకుంది కదా.. ఎందుకు నువ్ హ్యాపీగా లేవని నా స్నేహితులు అడుగుతున్నారు. సినిమా విజయం సాధించినప్పటికీ.. కార్తీకేయ 2 జర్నీ అయిపోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. అందుకే నేను ఈ హిట్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నా' అనుపమ అని అన్నారు.

'కార్తికేయ 2 లాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు.. నన్ను భరించినందుకు డైరెక్టర్ చందూ మొండేటి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. చిత్ర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు ప్రత్యేక  థాంక్స్‌. ఇదొక మంచి సినిమా అని ప్రేక్షకులు చెప్పడమే మాకు దక్కిన పెద్ద విజయం' అని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చారు. ఈ సక్సెస్‌ మీట్‌లో చిత్ర బృందంతో పాటుగా నిర్మాతలు దిల్‌ రాజు, అల్లు అరవింద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్ సిటీ బస్సుల్లో 2 గంటల ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే..

Also Read: Nashik Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం.. గంట వ్యవధిలో మూడుసార్లు...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News