నాని క్రికెటర్‌గా సెట్స్‌పైకి వెళ్లనున్న సినిమాకు టైటిల్ ఫిక్స్

న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా టైటిల్ పోస్టర్ విడుదల

Last Updated : Jun 15, 2018, 06:20 PM IST
నాని క్రికెటర్‌గా సెట్స్‌పైకి వెళ్లనున్న సినిమాకు టైటిల్ ఫిక్స్

బిగ్ బాస్ 2 రియాలిటీ షో హోస్టింగ్‌తో బిజీగా ఉన్న న్యాచురల్ స్టార్ నాని ఇవాళ తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశాడు. రేపు టైటిల్ వివరాలు విడుదల చేస్తానని నిన్న ప్రకటించినట్టుగానే ఇవాళ ఆ వివరాలను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాడు నాని. సుమంత్ నటించిన మళ్లీ రావా మూవీ ఫేమ్ గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు జెర్సీ అనే టైటిల్ ఖరారు చేశారు. జెర్సీ టైటిల్, పోస్టర్‌లో చూపించిన అర్జున్ 36 పేరిట ఉన్న జెర్సీ, క్రికెట్ బ్యాట్, హెల్మెట్, గ్లొవ్స్, ప్యాడ్స్ వంటివన్నీ చూస్తోంటే, న్యాచురల్ స్టార్ ఈ సినిమాలో క్రికెటర్ గా నటించనున్నాడా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

అపజయం లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని చివరిగా విడుదలైన కృష్ణార్జున యుద్ధం సినిమాతో కాస్త చేదు అనుభవాన్ని ఎదుర్కున్నాడు. కృష్ణార్జున యుద్ధం తర్వాత నాగార్జునతో కలిసి శమంతకమణి, భలే మంచి రోజు చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ మల్టీస్టారర్‌తో మళ్లీ వెంటనే ఫామ్‌లోకి వచ్చేయాలనేది నాని ఆకాంక్ష. 

 

Trending News