Oppo Reno8 5G: ఒప్పో రెనో 8పై భారీ తగ్గింపు.. రూ.39 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9999కే..

ఒప్పో రెనో8 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే గరిష్ఠంగా రూ.20 వేలు వరకు తగ్గింపు లభిస్తుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 16, 2022, 04:53 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఆఫర్స్
  • ఒప్పో రెనో8 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9999కే
  • ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకోండి
Oppo Reno8 5G: ఒప్పో రెనో 8పై భారీ తగ్గింపు.. రూ.39 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9999కే..

Oppo Reno8 5G Smartphone: ప్రముఖ ఈకామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కస్టమర్స్‌ కోసం  పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. రూ.99 విలువ చేసే వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే వస్తువుల వరకు చాలా వాటిపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే రెండింటిలోనూ బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఒప్పో రెనో8 5జీ స్మార్ట్ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. చౌక ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే మంచి తరుణమని చెప్పొచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో 23 శాతం డిస్కౌంట్ ఆఫర్ :

ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో8 5జీ స్మార్ట్ ఫోన్‌పై 23 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ద్వారా రూ.38,999 విలువ చేసే ఒప్పో రెనో8 స్మార్ట్ ఫోన్ మీకు కేవలం రూ.29,999కే లభిస్తుంది.అంటే.. రూ.9 వేలు ఆదా అవుతుంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌పై మరో రూ.3 వేలు వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలా ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌చేంజ్ ద్వారా కేవలం రూ.9999కే

 ఒప్పో రెనో8 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే గరిష్ఠంగా రూ.20 వేలు వరకు తగ్గింపు లభిస్తుంది. పూర్తి ఆఫర్ లభించినట్లయితే రూ.29,999కి అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.9999కే మీ సొంతం చేసుకోవచ్చు. 

ఒప్పో రెనో8 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్

8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
6.43 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
50 మెగా పిక్సెల్+8 మెగా పిక్సెల్+2మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
మిడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్
4500 mAh బ్యాటరీ 

Also Read: క్లిక్స్ కోసం నన్ను బద్నామ్ చేయొద్దు.. కామన్ సెన్స్ ఉండాలంటూ దిల్ రాజు ఫైర్

Also Read: IQOO 9T 5G: సగం కన్నా తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్.. అమెజాన్ అద్భుత ఆఫర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News