ఆస్కార్స్ గెలుచుకున్న ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వీళ్లే!

ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఆర్టిస్టులు ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్ అవార్డ్స్ రేసులో ఈ ఏడాది ఎవరు నిలిచారు ? ఏ సినిమాకుగాను ఎవరు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డ్ అందుకున్నారు ?

Last Updated : Mar 5, 2018, 07:02 PM IST
ఆస్కార్స్ గెలుచుకున్న ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వీళ్లే!

'డార్కెస్ట్ అవర్‌' సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన గారీ ఓల్డ్‌మన్‌‌కి జేన్ ఫొండా, హెలెన్ మిర్రా చేతుల మీదుగా ఆస్కార్స్ 2018 ఉత్తమ నటుడు పురస్కారం లభించింది. 'త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిసోరీ' సినిమాలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్‌ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. జోడీ ఫాస్టర్, జెన్నిఫర్ లారెన్స్ మెక్‌డోర్మండ్‌‌కి ఈ అవార్డ్ అందజేశారు. 'ది షేప్ ఆఫ్ వాటర్' సినిమాను బెస్ట్ ఫిలిం అవార్డ్ వరించింది. ఇదే సినిమాకు దర్శకత్వం వహించిన గిల్లెర్మో డెల్ టోరో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ అందుకోవడం విశేషం. ఆస్కార్  2017 ఉత్తమ నటి అవార్డు విజేత ఎమ్మా స్టోన్ చేతుల మీదుగా గిలెర్మో డెల్ టోరో ఈ ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. 

 

తొలిసారిగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న టోరో అవార్డ్స్ ప్రజెంటేషన్ వేదికపై నుంచి మాట్లాడుతూ.. "తాను ఓ వలసదారుడినని, అయినప్పటికీ ఆ సరిహద్దులను చెరిపేసే గొప్ప శక్తి కళకు వుంది" అని అభిప్రాయపడ్డారు. 

Trending News