ఈద్ ఎఫెక్ట్: భారతీయ సినిమాలు పాక్ లో నిషేధం !

                         

Last Updated : May 25, 2018, 05:22 PM IST
ఈద్ ఎఫెక్ట్: భారతీయ సినిమాలు పాక్ లో నిషేధం !

భారతీయ సినిమాలపై పాక్ నిషేధం విధించింది. ఈ మేరకు పాక్ సమాచార ప్రసారాల శాఖ నోటీసులు జారీ చేసింది. రంజాన్ పండగను పురస్కరించుకొని విదేశీ సినిమాలను నిషేధించామని పేర్కొంది. రంజాన్ ఈద్‌కు  రెండు రోజుల ముందు నుంచి పండగ తర్వాత రెండు వారాల వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. తాజా ఆదేశాలను అనుసరించి ఈ వ్యవధిలో భారత్‌తో సహా విదేశీ సినిమాలను పాక్ లో ప్రదర్శించకూడదు. అయితే పాక్ సినిమాలపై మాత్రం ఎలాంటి నిషేదం విధించలేదు. స్థానిక సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సర్కార్ వెల్లడించింది.

పాక్ లో బాలీవుడ్,హాలీవుడ్ సినిమాల నుంచి నెలకొన్న పోటీతో స్థానిక సినిమాలకు ఆదరణ కరువైంది. విదేశీ సినిమాల నుంచి పాక్ సినీ పరిశ్రమలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని... పండగ సమయంలో స్థానిక సినిమాలను ప్రదర్శించడానికి థియేటర్లు కూడా దొరకడం లేదని పాక్ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నటీనటులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

రంజాన్ పండగను పుసర్కరించుకొని తమ సినిమాలకు రిలీజ్ చేసి భారీ కలెక్షన్లు సాధించాలనుకున్న బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లకు పాక్ నిర్ణయం నిరాశ కల్గిస్తోంది. కాగా పాక్ సర్కార్ నిర్ణయాన్ని భారత్ సినీ పరిశ్రమతో సహా హాలీవుడ్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జనాలకు వినోదాన్ని పంచే విషయంలో స్థానికత అంశాలను పరిగణించాల్సిన అవసరం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

 

 

 

Trending News