శ్రీరెడ్డి,వర్మ వ్యవహారం తేల్చాలని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా)కు పవన్ కల్యాణ్ అల్టిమేటం జారీ చేశారు. 24 గంటల గడువు ఇచ్చి..ఈ లోపు తేల్చకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు. వర్మ ప్రోద్భలంతో నటి శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ తో పాటు ఆయన తల్లిపై అసభ్య పదాజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న పవన్ కల్యాణ్ .. ఈ రోజు ఫిలిం చాంబర్ వద్ద బైఠాయించారు. పవన్ కు మద్దతుగా మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
శాంతి భద్రతల దృష్ట్యా ఫిలిం ఛాంబర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు పవన్ కాస్త మెత్తబడ్డారు. తన డిమాండ్‌ను మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ( మా ) పెద్దలకు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 24 గంటల వ్యవధిలో శ్రీరెడ్డి,వర్మల పై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ 'మా'కు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో శ్రీరెడ్డి వ్యవహారం మరింత వేడేక్కింది. పవన్ అల్టిమేటం నేపథ్యంలో మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కు ఏ మేరకు స్పందిస్తుందనేది దానిపై ఉత్కంఠత నెలకొంది.