చేగువేరాతో పవన్ కళ్యాణ్ కుమార్తె

నెల్లూరులోని వీఆర్ కాలేజ్‌లో ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్నప్పుడు..

Updated: Jul 7, 2018, 06:20 PM IST
చేగువేరాతో పవన్ కళ్యాణ్ కుమార్తె

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విప్లవకారుడు చేగువేరా అంటే అంతులేని అభిమానం. చేగువేరా నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని ఆయన ఎన్నో సార్లు చెప్పారు. తాజాగా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న మ్యూజియంలో చేగువేరా మైనపు విగ్రహం పక్కన నిలబడి... తన కుమార్తె పొలీనా అంజనీ దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా ఆయన పంచుకున్నారు. చేగువేరా మాదిరి చేయెత్తి పిడికిలి చూపిస్తున్న పొలీనా ఫొటో ఎంతో ఆకట్టుకుంటోంది.

"నెల్లూరులోని వీఆర్ కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నప్పుడు... తొలిసారి చేగువేరా గురించి చదివా. ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట ఆయన నా జీవితంలో ఉంటున్నారు. ఇలా జరుగుతుండటం ఆశ్యర్చాన్ని కలిగిస్తుంది" అంటూ ట్వీట్ చేశారు.

 

ప్రపంచంలో అరాచకం, దోపిడీ, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు బాధపడుతున్నప్పుడు, అవసరమైతే దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకి అండగా నిలబడాలి' అని తాను చేగువేరా జీవితం నుంచి నేర్చుకున్నట్లు పవన్ పేర్కొన్నారు. ఆఖరి క్షణాల వరకు చేగువేరా నమ్మిన సిద్దాంతానికి అనుగుణంగా నడిచారని ఆయన అన్నారు.