బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా.. తన బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త నిక్ జోనస్‌కు పబ్లిక్‌గా ముద్దుపెట్టింది. ఆదివారం ప్రియాంకా తనకు కాబోయే భర్తకు ముద్దుపెట్టి తన ప్రేమను చాటిచెప్పింది. ఇద్దరి మధ్య ఎంతప్రేమ ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి ప్రియాంకా చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ఫోటో కింద హ్యాపీ బర్త్ డే బేబి నిక్ జోనస్ అని రాశారు. ఆదివారం నిక్ జోనస్ 26వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. అంతకు ముందు ప్రియాంకా.. కాలిఫోర్నియాలోని ఏంజెల్ స్టేడియంలో నిక్‌ను తొలిసారి పబ్లిక్‌గా కిస్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది.
ఇటీవల ప్రియాంకా, నిక్‌లు తమ రిలేషన్షిప్‌ను అధికారికంగా ప్రకటించి.. ముంబైలో రోకా సెర్మనీ జరుపుకున్నారు. ఈ సెర్మనీకి నిక్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. వచ్చే ఏడాది అమెరికాలోనే ప్రియాంకా నిక్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఇద్దరూ కొన్ని నెలల క్రితం లండన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
2017లో జరిగిన మెట్ గాలా ఈవెంట్‌లో ఇద్దరూ తొలిసారి కలిశారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రేమ బంధం వివాహానికి దారితీసింది.
ప్రియాంకా ప్రస్తుతం షోనాలి బోస్ దర్శకత్వంలో 'ది స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వసీం కీలక పాత్రలు పోషిస్తున్నారు.