అగ్ర హీరో చెంప ఛెళ్లుమనిపించిన రాధికా ఆప్టే

రాధికా ఆప్టే దక్షిణాదిన రక్త చరిత్ర, లెజెండ్, లయన్, కబాలి వంటి చిత్రాలలో నటించారు.

Last Updated : Mar 15, 2018, 04:07 PM IST
అగ్ర హీరో చెంప ఛెళ్లుమనిపించిన రాధికా ఆప్టే

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. అభిప్రాయం ఏదైనా ముక్కుసూటిగా చెప్పడం ఆమెకున్న నైజం. ఆమె వివిధ సందర్భాల్లో చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా వార్తల్లో నిలిచాయి. దక్షిణ చిత్ర పరిశ్రమలో ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆమె  సౌత్ లో ఓ అగ్ర హీరో చెంప ఛెళ్లుమనిపించానని చెప్పి షాకిచ్చారు.

రాధికా ఆప్టే ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే బీఎఫ్ఎఫ్ టీవీ టాక్‌ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌లో ఎదురైన కొన్ని అనుభవాలను టాక్ షో ద్వారా పంచుకున్నారు.  ‘ఓ సినిమా సెట్స్‌లో తొలిరోజు ప్రముఖ దక్షిణాది హీరో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను షాక్‌ అయ్యా..! మరో ఆలోచన లేకుండా వెంటనే అతడి చెంప పగలగొట్టాను’ అని ఆమె చెప్పారు.

రాధికా ఆప్టే దక్షిణాదిన రక్త చరిత్ర, లెజెండ్, లయన్, కబాలి వంటి చిత్రాలలో నటించారు.

ఇటీవలే రాధికా ఆప్టే సోషల్‌ మీడియాలో బీచ్‌లో బికినీ ధరించి.. మద్యం సేవిస్తున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాక.. సోషల్ మీడియా ఫాలోవర్ల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు. దీనికి రాధికా స్పందిస్తూ.. బీచ్‌లో కూడా తాను శారీ కట్టుకోవాలని కొందరు అనుకుంటున్నారని.. అయితే తన ఇష్టం తనదని ఘాటుగానే బదులిచ్చారు.

Trending News