రజనీకాంత్ "కాలా" కొత్త పోస్టర్ విడుదల

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘కాలా’. ఆయన నటించిన "కబాలి" సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రానికి కూడా డైరెక్షన్ వహిస్తున్నారు. 

Last Updated : Apr 28, 2018, 11:39 PM IST
రజనీకాంత్ "కాలా" కొత్త పోస్టర్ విడుదల

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘కాలా’. ఆయన నటించిన "కబాలి" సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రానికి కూడా డైరెక్షన్ వహిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని రజనీకాంత్ అల్లుడు ధనుష్ 'వండర్‌బార్‌ ఫిల్మ్స్‌' బ్యానరుపై నిర్మిస్తున్నారు. అయితే ఏప్రిల్ 27వ తేదిన విడుదల కావాల్సిన ఈ సినిమా ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

ఈ క్రమంలో ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను మే 9వ తేదిన నిర్వహించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా "కాలా" చిత్రం కొత్త పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌, హూమా ఖురేషీ, ఈశ్వరీ రావు, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. "కాలా" చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ పంపిణీ చేయగా.. జూన్ 7వ తేదిన ఈ సినిమాని నిర్మాతలు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారనే టాక్ వస్తోంది. 

 

Trending News