Rathnam: మాస్‌ లుక్‌లో విశాల్..‘రత్నం’ టైటిల్, ఫస్ట్ షాట్ టీజర్ విడుదల..

Rathnam: హీరో విశాల్‌ నటిస్తున్న రత్నం మూవీ ఫస్ట్ షాట్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే వర్డ్స్‌ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. అయితే ఈ టీజర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.     

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2023, 08:01 PM IST
Rathnam: మాస్‌ లుక్‌లో విశాల్..‘రత్నం’ టైటిల్, ఫస్ట్ షాట్ టీజర్ విడుదల..

Rathnam: మరోసారి రత్నం సినిమా ద్వారా మాస్ లుక్‌లో హీరో విశాల్ కనిపించబోతున్నారు. ఈ మూవీని జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా రూపొందిస్తోంది. రత్నం సినిమాకు హరీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ కో ప్రోడ్యుసర్స్‌గా ఈ మూవీలో హీరోగా విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ మూవీకి  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిచనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన  టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌ను లాంచ్‌ చేశారు. 

ఈ మొదటి షాట్ టీజర్ గూస్ బంప్స్ స్టఫ్‌లా అనిపించింది. ఈ టీజర్‌లో మంచి సెటప్, బ్యాక్‌ డ్రాప్‌, మూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్, కత్తులతో నరకడం, విశాల్ మాస్‌ లుక్‌ అన్నీ షాట్స్‌ టీజర్‌కు మంచి పేరును అందించింది.  ఈ టీజర్‌లో "కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా" అని బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే వర్డ్స్‌ అందరినీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయని చెప్పొచ్చు. ఈ రత్నం సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మిగతా అప్డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News