Bimbisara: బంపర్ హిట్ మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఇదే కాదు ఈ హిట్ సినిమాలన్నీ మిస్!

Raviteja Rejected Bimbisara: కళ్యాణ్ రామ్ రీసెంట్ హిట్ బింబిసార నిజానికి ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా అని, ఆయన కాదనుకోవడంతో అది కళ్యాణ్ రామ్ దాకా వచ్చిందట. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2022, 05:08 PM IST
Bimbisara: బంపర్ హిట్ మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఇదే కాదు ఈ హిట్ సినిమాలన్నీ మిస్!

Raviteja Rejected Bimbisara in intial days and Missed a Hit: కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసార సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా చాలాకాలం తర్వాత ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడమే కాక టాలీవుడ్ లో కూడా చాలా కాలం తర్వాత  సరైన హిట్ సినిమా పడినట్లు అయింది. ఈ దెబ్బతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు కదిలి వెళుతున్నారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో మంచి కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. అయితే నిజానికి ఈ సినిమా ఒక స్టార్ హీరో కాదనుకున్న సినిమా అనే విషయం ఇప్పుడు తాజాగా టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. కళ్యాణ్ రామ్ ఈ బింబిసార ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు వశిష్ట ముందు రవితేజను ఈ కథతో సంప్రదించాడు. ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగిన తర్వాత రవితేజ కథ కూడా నచ్చిందట అయితే ఎందుకో మరి రవితేజ ఈ సినిమా చేసి ఎందుకు తర్వాత స్టేజిలలో ఆసక్తి చూపలేదని అంటున్నారు. కథ ప్రకారం చూసుకుంటే సినిమా రాచరికపు నేపథ్యంలో ఉంటుంది కాబట్టి కచ్చితంగా గ్రాండియర్ కావాలని, పెద్ద ప్రాజెక్టు కావడంతో కొత్త దర్శకుడు ఈ సినిమా హ్యాండిల్ చేయగలడా? లేడా? అనే విషయంలో రవితేజకు అనుమానం రావడంతోనే సైలెంట్ అయ్యాడని అంటున్నారు.

రవితేజ కాదనుకున్నాక ఇదే కథతో వశిష్ట కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లడం ఆయన ఎన్టీఆర్ కు కూడా కథ వినిపించి ఆయనకు నచ్చిన తర్వాత ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మొదలు పెట్టడం జరిగిపోయాయి. నిజానికి కళ్యాణ్ రామ్ మార్కెట్ కి ఇది తగిన కథ కాదు. అయినా సరే కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణకు సొంత విఎఫ్ఎక్స్ స్టూడియో ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా అనుకున్న బడ్జెట్లో చేయగలమనే నమ్మకం ఏర్పడడంతో రంగంలోకి దిగి సినిమా చేయడం, విడుదల చేయడం, మంచి హిట్ అవడం ఇలా వెంట వెంటనే జరిగిపోయాయి.

అయితే తన దగ్గరకు వచ్చిన అనేక సినిమాలను రవితేజ సరిగా జడ్జి చేయకుండా వదిలేయడంతో ఆయన దాదాపు చాలా హిట్ సినిమాలు వదులుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఆనందం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు పాత్ర, గోదావరి సినిమాలో సుమంత్ పాత్ర, ఆర్య సినిమాలో అల్లు అర్జున్ పాత్ర, టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర, జై లవకుశ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర రవితేజ కాదనుకున్నవే. ఇక గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన రోల్ కూడా రవితేజ చేయాల్సిందే కానీ అంతకు ముందే పవన్ రీమేక్ హక్కులు కొనుక్కున్నారని తెలియడంతో ఆయన సైలెంట్ అయ్యారు. 

Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!

Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News