మీరు మీ మొబైల్ ఫోన్ లో జియో సిమ్ ను కలిగి ఉన్నారా? అందులో మై జియో యాప్ ఉందా? అయితే మీకు శుభవార్త. మీ జియో యాప్ లో కొత్తగా హల్లో జియో అనే వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అనే అప్ డేట్ వచ్చింది. ఇందుకు గానూ మీరు మీ జియో యాప్ ను అప్ డేట్ చేయవలసి వస్తుంది. ఇప్పటివరకు ఈ ఫీచర్ జియో ఫోన్ లలో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ప్రవేశపెట్టినట్లు జియో వర్గాలు తెలిపాయి.
మొబైల్ లో మై జియో యాప్ ను అప్ డేట్ చేశాక.. పక్కనే ఒక మైక్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ మైక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే.. హల్లో జియో అనే వాయిస్ అసిస్టెంట్ లోకి వెళ్లిపోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ మాదిరి దీనికి ఎటువంటి వాయిస్ ట్రైనింగ్ ఇవ్వవలసిన అవసరం లేదు. అయితే ఇది కేవలం జియో ఆధారిత సేవలు ఉపయోగించుకోవడానికే ఉపకరిస్తుంది. అంటే మొబైల్ బ్యాలెన్స్, డాటా బ్యాలెన్స్, మొబైల్ రీచార్జీ తదితర సేవలన్నమాట. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉంది.