లక్ష్మీపార్వతి పాత్రకు ప్రముఖ మోడల్‌ ఎంపిక అనేది అబద్ధం..!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’.

Last Updated : Nov 5, 2018, 01:38 PM IST
లక్ష్మీపార్వతి పాత్రకు ప్రముఖ మోడల్‌ ఎంపిక అనేది అబద్ధం..!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ  సినిమాకి సంబంధించి పాత్రల విషయంలో కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా లక్ష్మీ పార్వతి పాత్రకు ఎవరిని తీసుకోవాలన్న విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి.  ఈ క్రమంలో ఆర్జీవీ ఈ పాత్రకు గాను ప్రముఖ మోడల్ రుపాలి సూరిని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి.  అయితే ఆ వార్తలు అబద్ధమని.. అది ఫేక్ న్యూస్ అని ఆర్జీవి తెలిపారు. 

‘డ్యాడ్‌, హోల్డ్‌ మై హ్యాండ్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించిన రూపాలి ముంబయిలో మంచి మోడల్‌గా సుపరిచితులు. ఇటీవలే తిరుపతిలో  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇంకా ఎన్టీఆర్‌తో పాటు ఇతర పాత్రలకు నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడి కోసం ఆయన పోలికలతో ఉన్న ఓ వ్యక్తిని సోషల్ మీడియా
ద్వారా గుర్తించిన ఆర్జీవి ఆయనను సంప్రదించిన సంగతి తెలిసిందే.

తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పుత్రరత్నం బాలకృష్ణ కూడా తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా  ‘యన్‌టిఆర్‌’ బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే పాత్రల ఎంపిక జరిగింది. ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ ఆ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడి పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. తొలుత ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాలని భావించినా.. తర్వాత ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. 

Trending News