గుడ్ న్యూస్: ఇండియన్ రైల్వేలో 1,30,000 ఖాళీల భర్తీకి రంగం సిద్ధం

ఇండియన్ రైల్వేలో 1,30,000 ఉద్యోగాల దరఖాస్తులకు ప్రారంభ తేదీల సమాచారం.

Last Updated : Feb 13, 2019, 09:25 PM IST
గుడ్ న్యూస్: ఇండియన్ రైల్వేలో 1,30,000 ఖాళీల భర్తీకి రంగం సిద్ధం

న్యూఢిల్లీ: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. అన్ని రైల్వే డివిజన్స్‌లో కలిపి మొత్తం 1 లక్ష 30 వేల ఉద్యోగాల భర్తీకి ఇండియన్ రైల్వే ఇటీవలె నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్‌బి/సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్(సీఈఎన్) నెం.1/2019, 2/2019, 3/2019, ఆర్ఆర్‌సీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్(సీఈఎన్) నెం.ఆర్ఆర్‌సీ-1/2019 నోటిఫికేషన్స్ త్వరలోనే ఆర్ఆర్‌బి అధికారిక వెబ్‌సైట్‌పై ప్రత్యక్షం కానున్నాయి.

(ఎ) ఆర్ఆర్‌బి/సీఈఎన్ 01/2019- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఎకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమెర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమెర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్స్ ఎకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమెర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్ వంటి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు(ఎన్టీపీసీ) ఉద్యోగాల ఆన్ లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కు ఫిబ్రవరి 28వ తేదీ ప్రారంభ తేదీ కానుంది.  

(బి) ఆర్ఆర్‌బి/సీఈఎన్ 02/2019- స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ వంటి పారామెడికల్ సిబ్బంది పోస్టులకు ఆన్ లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 04.03.2019 కానుంది. 

(సి) ఆర్ఆర్‌బి/సీఈఎన్ 03/2019- స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) వంటి పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 08.03.2019 కానుంది.

(డి) ఆర్ఆర్‌సి 01/2019: ట్రాక్ మెయింటైనర్ 4వ గ్రేడ్ ట్రాక్‌మ్యాన్), గేట్‌మ్యాన్, పాయింట్స్‌మ్యాన్, పోర్టర్స్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, మెకానికల్ వంటి విభాగాల్లో హెల్పర్స్ వంటి ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 12.03.2019గా వుండనుంది. 

మొత్తం ఖాళీల సంఖ్య : 1,30,000

వేతనం: 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వివిధ ఉద్యోగాలకు వివిధ స్థాయిల్లో వేతనం, అలవెన్సులు వర్తించనున్నాయి. 

 

దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ వారికి రూ.500 కాగా ఎస్సీ/ఎస్టీ వంటి మినహాయింపు వర్గాలకు రూ.250గా నిర్ణయించారు.

Trending News