close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

దిమ్మతిరిగే రొమాంటిక్ యాంగిల్‌లో సాహో జోడీ !!

సాహో మూవీలో హెలెట్ గా నిలిచే రోమాంటిక్ స్టిల్ మీ కోసం..

Updated: Jul 23, 2019, 06:42 PM IST
దిమ్మతిరిగే రొమాంటిక్ యాంగిల్‌లో సాహో జోడీ !!

సాహో గురించి చర్చ ప్రారంభమైన తొలి నాళ్లలో ఇది పక్కా యాక్షన్ మూవీ అనుకున్నారు రెబల్‌స్టార్ ఫ్యాన్స్.. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో సాహోలో ఇది ఒక్క యాంగిల్ మాత్రమేనని.. మరో యాంగిల్ లో రోమాన్స్ ఫుల్ ప్రాధాన్యత ఇచ్చే మూవీగా ప్రయోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు చిత్రయూనిట్.  అయితే దీన్ని  ఆడియన్స్ ఎవరూ అంతలా సీరియస్ గా తీసుకోలేదు...ఇప్పటికీ రెబల్ స్టార్ మూవీని యాక్షన్ మూవీగా చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా సాహో జోడీ రోమాంటిక్ ఫోజు లిస్తూ మరో యాంగిల్ ను ఇంట్రోడ్యూస్ చేసి ఆడియాన్స్ కు ఈ మూవీ పట్ల మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్..

సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో మూవీ గురించి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ వారి అల‌రిస్తున్నాడు ప్ర‌భాస్. ఈ రోజు స్ట‌న్నింగ్ రొమాంటిక్ పోస్ట‌ర్ ని పోస్ట్ చేశాడు. అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము అనే సందేశం తో హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ కి నెటిజ‌న్ లు ఫిదా అయిపోయారు. ఇక డైహ‌ర్ట్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.. మరి అంతలా ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ చూసి మీరూ ఎంజాయ్ చేయండి మరి..

http://akamai.vidz.zeecdn.com/zeecinemalu/2019/07/saaho-prabhas-2.jpg
సాహో చిత్రానికి సంబందించి మెద‌టి సింగిల్ ని ఇలా విడుద‌ల చేశారు. రెండ‌వ సింగిల్ ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తున్నారట.