వీడియో: హీరోయిన్‌పై హీరో లైంగిక వేధింపుల కేసు.. నాకేం తెలియదన్న సల్మాన్‌ ఖాన్ !

నాకేం తెలియదు.. ఏం జరుగుతుందో చూద్దాం : సల్మాన్ ఖాన్

Last Updated : Sep 29, 2018, 01:54 PM IST
వీడియో: హీరోయిన్‌పై హీరో లైంగిక వేధింపుల కేసు.. నాకేం తెలియదన్న సల్మాన్‌ ఖాన్ !

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ప్రముఖ బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలు బాలీవుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. షూటింగ్ సెట్‌లో అందరి ముందే ఆయన తనని వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించడం బాలీవుడ్ లో చర్చనియాంశమైంది. ఈ దుమారం మీడియాలో హాట్ టాపిక్ కావడంతో నానా పటేకర్ సైతం తన న్యాయవాది ద్వారా ఆమెకు లీగల్ నోటీసులు పంపించాడు. నిరాధారమైన ఆరోపణలు చేసి, తన పరువుకు భంగం వాటిల్లేలా చేసినందుకు తనూశ్రీ దత్తా తనకు క్షమాపణలు చెప్పాలని నానా పటేకర్ డిమాండ్ చేసినట్టుగా అతడి తరపు న్యాయవాది మీడియాకు తెలిపాడు. బాలీవుడ్ ని కుదిపేస్తోన్న ఇదే అంశంపై స్పందించాల్సిందిగా తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ని కోరారు అక్కడే ఉన్న పాత్రికేయులు. అయితే, ఈ వివాదంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. అసలు ఈ మొత్తం వ్యవహారంపై తనకు ఏమీ తెలియదని, ఎం జరుగుతుందో తెలియనప్పుడు తానెలా చెప్పగలనని అన్నాడు. ఈ వివాదాన్ని లీగల్ టీమ్ చూసుకుంటోందని, ఏం జరగనుందో వేచిచూద్దాం అంటూ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చాడు సల్మాన్ ఖాన్.

 

Trending News