బాలీవుడ్ అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్ ఇంట విషాదం

‘అమ్మీ.. మీరు మా అందరికీ తెలివి, పట్టుదల, బుద్ధిని ఇచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్, అనువాదకురాలు, ఎడిటర్, సోదరి, భార్య, అత్త, అమ్మమ్మ, స్నేహితురాలు ఇలా ఎన్నో రకాలుగా మాకు ఎంతో చేశావని’ హీరో చేసిన పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది.

Updated: Jan 19, 2020, 11:18 AM IST
బాలీవుడ్ అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్ ఇంట విషాదం

బాలీవుడ్‌ హీరోలు షాహిద్ కపూర్‌, ఇషాన్ కట్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ నటుల అమ్మమ్మ ఖదిజా అజీమ్ మృతి చెందారు. హిందీ టీవీ, సినీ నటి నీలిమ అజీమ్ తల్లి ఖదిజా అజీమ్ గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో  శనివారం ఖదిజా తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దఢక్ ఫేమ్ ఇషాన్ కట్టర్ సోషల్ మీడియాలో తెలిపారు.

అమ్మమ్మ లేని లోటుపై ఇషాన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది. ‘అమ్మీ.. మీరు మా అందరికీ తెలివి, పట్టుదల, బుద్ధిని ఇచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్, అనువాదకురాలు, ఎడిటర్, సోదరి, భార్య, అత్త, అమ్మమ్మ, స్నేహితురాలు ఇలా ఎన్నో రకాలుగా మాకు ఎంతో చేశావు. ఇతరులెవ్వరు నీ స్థానాన్ని భర్తీ చేయలేరు. నీవు నా జీవితంలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నాను. ఎవరి జీవితాలపై నీ ప్రభావం ఉందో వారు ఎన్నటికీ నిన్ను మరిచిపోలేరంటూ’ యంగ్ హీరో ఇషాన్ కట్టర్ భావోద్వేగంతో చేసిన పోస్ట్ నెటిజన్లను మనసు దోచుకుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Ammi.. you instilled wit, fire, knowledge, perseverance, purpose and meaning in all of us. Freedom fighter, writer, translator, editor.. sister, wife, mother, aunt, grandmother, friend, confidant - you were so many things and more. They don’t make them like you anymore. Blessed to have had you in my life. I’ll carry a small piece of your vast presence with me always. You’ll never be forgotten by anybody whose life you deeply impacted. In the first picture on the left, my Nani - Khadija Azeem - with her sister and my grand aunt, Shahida ammi. Here she is beaming proudly at her elder grandson’s wedding reception. The second picture is her with her two children, my Mamoo and my mother. And the third is her with her favourite aunt and mom.

A post shared by Ishaan (@ishaankhatter) on

తెలుగులో సక్సెస్ అయిన అర్జున్ రెడ్డి బాలీవుడ్‌ రీమేక్ కబీర్ సింగ్‌తో షాహిద్ కపూర్ విజయాన్ని అందుకున్నాడు. మరో తెలుగు మూవీ జెర్సీ రీమేక్ పనులతో బిజీగా ఉన్నాడు షాహిద్. అతడి సోదరుడు ఇషాన్ కట్టర్ సైతం తెలుగు సినిమా బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మూవీ టాక్సీవాల బాలీవుడ్ రీమేక్ ‘ఖాలీ పీలీ’తో ఇషాన్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..