‘సీత’ ట్రైలర్ అదుర్స్ ... రివ్యూ మీ కోసం

Last Updated : May 10, 2019, 05:03 PM IST
‘సీత’ ట్రైలర్ అదుర్స్ ... రివ్యూ మీ కోసం

బెల్లంకొండ శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్  జంటగా నటించిన  ‘సీత’ ట్రైలర్ రిలీజ్ అయింది. తేజ డైరెక్షన్ లో సినిమా అనగానే సినిమా డిఫెరెంట్ గా ఉంటుందని క్రియేట్ అయిన బజ్ కి,మరింత పాజిటివిటీ జోడిస్తుంది ఈ సినిమా ట్రైలర్. 

ట్రైలర్ ని బట్టి కథ హీరో, హీరోయిన్స్ చిన్నతనం నుండే బిగిన్ అవుతుందని తెలుస్తుంది. 1:33 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో కథ ఏంటనేది ఎక్కడా రివీల్ అయితే కాలేదు, ఎక్కడో రామాయణానికి ఈ సినిమా కాన్సెప్ట్ కి దగ్గర పోలికలున్నాయనే విషయం అర్థమవుతుంది.

కాకపోతే ఇక్కడ ‘సీత’ క్యారెక్టర్ ని చాలా డిఫెరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడు తేజ. సినిమాలోని ఒక స్టేజ్ లో డబ్బే ముఖ్యమనే ఆటిట్యూడ్ తో ఉంటుందనిపిస్తుంది. అల్టిమేట్ గా ‘సీత’ తేజ మార్క్ ఉన్న సినిమా కాబోతుందనిపిస్తుంది.

ఈ నెల 24 న రిలీజవుతుంది ‘సీత’. అనూప్ రూబెస్స్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. AK ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.

 

 

 

 

 

@ జీ సినిమాలు

Trending News