జూమ్ యాప్ పై కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీం కోర్టు..

కరోనా మహమ్మారి కాలంలో విస్తృతంగా వెలుగులోకి వచ్చిన ప్రత్యేకమైన అప్లికేషన్ జూమ్. లాక్ డౌన్ కాలంలో  ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పరిపాలన, శాఖాపరమైన సేవలు వినియోగించుకున్న సంగతి తెలిసిందే..

Last Updated : May 23, 2020, 12:56 AM IST
జూమ్ యాప్ పై కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీం కోర్టు..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో విస్తృతంగా వెలుగులోకి వచ్చిన ప్రత్యేకమైన అప్లికేషన్ (Zoom) జూమ్. లాక్ డౌన్ కాలంలో  ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పరిపాలన, శాఖాపరమైన సేవలు వినియోగించుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ జూమ్ యాప్‌పై చట్టం చేసే వరకూ నిషేధం విధించడంపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. జూమ్ యాప్ వల్ల పౌరుల గోప్యత హక్కుకు భంగం వాటిల్లుతుందని, సైబర్ నేరాలు పెరగడానికి అవకాశం కల్పిస్తుందంటూ ఢిల్లీకి చెందిన హర్ష్‌చుఘ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Also Read: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..

కాగా ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా అభిప్రాయం తెలపాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూమ్ యాప్ ను ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దేశ సైబర్ భద్రతా సంస్థ సెర్ట్‌ఇన్ కూడా జూమ్ వినియోగదారులను సైబర్ నేరాలకు గురయ్యే అవకాశమున్నదని హెచ్చరించినట్టు పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News