తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పట్టణ పరిధిలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.. అయితే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నాడు కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Last Updated : May 22, 2020, 11:31 PM IST
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పట్టణ పరిధిలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.. అయితే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నాడు కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు మెత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1761 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 42 జీహెచ్‌ఎమ్‌సీలోనే (GHMC) నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మిగిలిన 20 కరోనా పాజిటివ్ కేసులలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో 19, రంగారెడ్డి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  అధికారికంగా వెల్లడించింది.

Also Read: Temperature updates : ఎండలతో హీటెక్కిన ఢిల్లీ.. తెలంగాణ, ఏపీలోనూ మండుటెండలు

మరోవైపు శుక్రవారం నాడు కరోనా పాజిటివ్‌ రోగులు చికిత్స తీసుకుని తిరిగి కరోనా నెగెటివ్‌ వచ్చి డిశ్చార్జ్‌ అయిన వారు 7 మంది ఉన్నారని, దీంతో మొత్తం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 670 గా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారి నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయి ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళిన వారి సంఖ్య 1043 మందిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మొత్తం 48 మంది. మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 118గా ఉందని వెల్లడించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News