Tata Nano Ev 2024: రతన్ టాటా కలల కారు.. రూ.1 లక్షలకే 312 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే నానో కారు.. లాంచ్ ఎప్పుడంటే!

Tata Nano Ev 2024: త్వరలోనే మార్కెట్‌లో అతి తక్కువ ధరలోనే టాటా నానో కారు విడుదల కాబోతోంది. ఇది శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 20, 2024, 02:43 PM IST
Tata Nano Ev 2024: రతన్ టాటా కలల కారు.. రూ.1 లక్షలకే 312 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే నానో కారు.. లాంచ్ ఎప్పుడంటే!

Tata Nano Ev 2024: గతంలో పోలిస్తే.. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పలు ఆటో మొబైల్‌ కంపెనీ కొత్త కొత్త EV కార్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నాయి. అయితే వీటి వినియోగం పెరగడం వల్ల చాలా వరకు పెట్రోల్‌, డీజిల్‌ కూడా ఆదా అవుతూ వస్తోంది. అలాగే ఒక వైపు పెట్రోల్‌ ధరలు ఆకాశాన్ని అంటడంతో చాలా మంది EV వెహికిల్స్‌ కొనుగోలు చేసేదుకు మెగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం చాలా ఆటో మొబైల్‌ కంపెనీలు EV మోటర్స్‌ను ఎక్కువగా విడుదల చేసేందుకు మెగ్గు చూపుతున్నాయి. ఈవీ వాహన రంగంలో తనదైన బ్రాండ్‌గా కీలక పాత్ర పోషిస్తున్న టాటా తమ కస్టమర్స్‌కి మరో గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. త్వరలోనే మిడిల్‌ రేంజ్‌ బడ్జెట్‌ కారును అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది గతంలో టాటా నానో విడుదల చేసిన సక్సెసర్‌గా లాంచ్‌ కాబోతోంది. అంతేకాకుండా కంపెనీ దీనిని  టాటా నానో ఈవీ పేరుతో విడుదల చేయబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు తెలుసుకోండి. 

మార్కెట్‌లో EV కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఆటో మొబైల్‌ కంపెనీలు ఈవీ కార్ల తయారీకి ఎక్కువగా ఫోకస్‌ పెట్టాయి. అయితే టాటా కంపెనీ ఇదే క్రమంలో టాటా నానో ఎక్ట్రిక్‌ వెరియంట్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల లోపే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారు రతన్ టాటా (Ratan Tata) కలల కారుగా మిడిల్‌ క్లాస్‌ కుటుంబలకు కారులేని లోటును నెరవేర్చేగా లాంచ్‌ కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన అధికారిక ప్రకటన కంపెనీ ఇప్పటికీ విడుదల చేయలేదు. ఈ కారు అతి తక్కువ ధరలో లభించినప్పటికీ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ విషయంలో ఏ మాత్రం కాంప్రమైస్‌ అయ్యే ప్రతసక్తి లేదు అన్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే.. టాటా నానో ఈవీ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు సమచారం. ఇది 17 kWh బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అలాగే దీని గరిష్ఠ వేగం కూడా గంటకి దాదాపు 80కిలోమీటర్ల స్పీడ్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కారు ఛార్జ్‌ చేసేందుకు దాదాపు 6 నుంచి 8 గంటల పాటు టైమ్‌ కూడా పట్టే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ కారు లోపలి భాగంలో 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. ఈ కారు టాటా కంపెనీ డిసెంబర్‌ చివరి వారంలో లేదా కొత్త సంవత్సరంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.  

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

2008 సంవత్సరంలో టాటా కంపెనీ ఈ నానో కారును కేవలం లక్షల రూపాయాల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ కారు సుదీర్ఘ కాలం పాటు మంచి సేల్స్‌ను పొందింది. ఆ తర్వాత టాటా కంపెనీ కొన్ని కారణాల వల్ల ఈ కారును మార్కెట్‌లో విడుదల చేయడం నిలిపివేసింది. అప్పుడు ఈ కారు అతి తక్కువ ధరలోనే లభించడం వల్ల చాలా మంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. 

Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News