నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ

నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ

Last Updated : Dec 30, 2018, 07:05 PM IST
నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు సినీ పరిశ్రమ

జనవరి 1వ తేదీ తర్వాత సినిమా టికెట్లపై జీఎస్టీ రేటును తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై టాలీవుడ్ హర్షం వ్యక్తంచేసింది. ఇటీవల జరిగిన జీఎస్టీ 31వ కౌన్సిల్ సమావేశంలో పలు వస్తు, సేవలపై పన్నును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటివరకు రూ.100 విలువ చేసే టికెట్లపై వున్న 18% పన్నును 12 శాతానికి తగ్గించగా అంతకన్నా ఎక్కువ విలువైన టికెట్లపై వున్న 28% పన్నును 18 శాతానికి తగ్గించడంపై ఇప్పటికే  బాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పగా తాజాగా వారి జాబితాలో చేరుతూ తెలుగు సినీ పరిశ్రమ సైతం ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియచేసింది. తెలుగు సినీ పరిశ్రమకు అనుబంధంగా పనిచేస్తున్న పలు యూనియన్లు, అసోసియేషన్లు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశాయి. 

Also read : జీఎస్టీ పన్ను రేట్లు: తగ్గనున్న సినిమా టికెట్ల ధరలు

సినిమా టికెట్లపై పన్నును తగ్గించిన కారణంగా కేంద్రం రూ.900 కోట్ల ఆదాయం కోల్పోనుందని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం చేసిన ప్రకటనలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Trending News