ట్రాఫిక్ పోలీసులకు రాంగ్ రూట్‌లో వెళ్లే వాహన చోదకులతో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రాంగ్ రూట్లో వెళ్తూ కూడా.. సరిగ్గానే వెళ్లామని బుకాయించేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి పూణె ట్రాఫిక్ పోలీసులు ఓ సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. కొన్ని స్పెషల్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.
ఈ స్పీడ్ బ్రేకర్లు, వాహనాల టైర్ల మందాన్ని పరిగణనలోకి తీసుకొని డిజైన్ చేయడం వల్ల.. సరైన రూట్‌లో వెళ్లే వాహనాలకు వీటి వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ రాంగ్ రూట్‌లో వెళ్లే వారు ఈ స్పీడ్ బ్రేకర్లు దాటితే మాత్రం ఏమవుతుందో తెలుసా.. జస్ట్.. టైర్ పంక్చర్ అవుతుంది అంతే..! ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు పెట్టిన చోట పోలీసులు "టైర్ కిలర్స్ ఉన్నాయి జాగ్రత్త.. రాంగ్ రూట్లో వెళ్లకండి" అని బోర్డులు కూడా పెట్టారు.
ఈ స్పీడ్ బ్రేకర్లను ఇనుప ముక్కలతో తయారుచేశారు. ఆ ఇనుప ముక్కలు చాలా పదునుగా ఉంటాయి. సరైన రూట్‌లో వచ్చి.. వీటిపై నుండి పోయే వాహనాల చక్రాలకు ఈ టైర్ కిల్లర్స్ వల్ల ప్రమాదమేమీ లేదు. కానీ.. రాంగ్ రూట్‌లో వస్తే మాత్రం.. ఈ టైర్ కిల్లర్స్ టైర్లను ఫంక్చర్ చేసేస్తాయి. ఎవరికి ఆ ఆలోచన వచ్చిందో గానీ.. రాంగ్ రూట్ మాస్టర్లకు మంచి గుణపాఠం నేర్పించడానికి ఈ స్పీడ్ బ్రేకర్లు తయారుచేశారని మాత్రం చెప్పవచ్చు.
Pune becomes 1st city in India to install tyre killers for wrong side driving #Pune #म pic.twitter.com/jVANLZ8x09
— Vishal Surywanshi (@vsurywanshi87) March 30, 2018