Happy Birthday Venkatesh | హ్యాపీ బర్త్ డే వెంకీమామ..

ప్యామిలీ పాత్రలైనా సై అంటాడు.. యాక్షన్ పాత్రలకూ సూటవుతాడు.. లవర్ బాయ్‌గానూ కనిపిస్తాడు.. వెరసి వెండి తెరకు అన్ని పాత్రలు చేయగలని నిరూపించిన నటుడు.. తెలుగు సినీ రంగంలో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో... అవును ఆయనే వెంకటేష్. ఆయన పుట్టిన రోజు నేడు. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు 1960 డిసెంబర్ 13న కారంచేడులో జన్మించారు. 

Last Updated : Dec 13, 2019, 09:25 PM IST
Happy Birthday Venkatesh | హ్యాపీ బర్త్ డే వెంకీమామ..

ప్యామిలీ పాత్రలైనా సై అంటాడు.. యాక్షన్ పాత్రలకూ సూటవుతాడు.. లవర్ బాయ్‌గానూ కనిపిస్తాడు.. వెరసి వెండి తెరకు అన్ని పాత్రలు చేయగలని నిరూపించిన నటుడు.. తెలుగు సినీ రంగంలో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో... అవును ఆయనే వెంకటేష్. ఆయన పుట్టిన రోజు నేడు. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు 1960 డిసెంబర్ 13న కారంచేడులో జన్మించారు. 
 
ఇంటి పేరే విక్టరీ..  
దగ్గుబాటి వెంకటేష్.. విక్టరీ వెంకటేష్‌గా మారడం వెనుక చాలా కఠోర శ్రమ.. నిబద్ధత కలిగిన పని దాగుంది. తండ్రి సినిమా నిర్మాత కావడంతో.. వెంకటేష్.. హీరోగా మారడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. కానీ హీరోగా ఒకసారి ప్రస్థానం ప్రారంభించిన తర్వాత.. దాన్ని నిలబెట్టుకోవడానికి.. తన కెరీర్‌ను సరైన దిశలో తీర్చిదిద్దుకోవడానికి ఆయన ఎంతగానో శ్రమించారు. చదువు పూర్తయిన తర్వాత తండ్రి రామానాయుడు అడుగుజాడల్లోనే నిర్మాతగా రాణించాలని భావించారు. కానీ అనుకోకుండా నటుడిగా మారాల్సిన అవసరం వచ్చింది. దీంతో నటనా రంగంలోకి వెంకటేష్ అడుగుపెట్టారు. కలియుగ పాండవులు సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే వెంకటేష్‌కు పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఈ  చిత్రానికి బెస్ట్ మేల్ డెబ్యూట్ యాక్టర్‌గా నంది అవార్డ్ కూడా అందుకున్నారు. దాంతో నటనపై మరింత ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత.. మంచి కథలు ఎంచుకుంటూ సినిమాలు చేశారు వెంకటేష్.

రామానాయుడు కుమారుడిగా వెంకటేష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. పరిశ్రమలో తనకంటూ సొంతంగా ఓ ప్రత్యేక  గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో చిత్రం త్రిమూర్తులుతో బెస్ట్ యాక్టర్‌గా అందుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించింది. బ్రహ్మ పుత్రుడు సినిమాను వెంకటేష్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఆయన ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నారు.  

మల్టీస్టారర్ సినిమాలకు శ్రీకారం...
తెలుగు సినీ పరిశ్రమలో నాటితరం కథానాయకుడు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్ తర్వాత దాదాపుగా మల్టీ స్టారర్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఐతే విక్టరీ వెంకటేష్.. ఆ సంప్రదాయానికి మళ్లీ శ్రీకారం చుట్టారు. మల్టీస్టారర్ సినిమాలకు తాను రెడీ అంటూ సినీ దర్శక నిర్మాతలకు సంకేతాలిచ్చారు. అన్న విధంగానే మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ సినీ పరిశ్రమలో ఓ ఆరోగ్యకరమైన వాతావరణానికి నాంది పలికారు.  

ఆయన చేసిన మల్టిస్టారర్ చిత్రాలు మసాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్-2.. తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ధర్మచక్రం లాంటి చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా నటించిన వెంకటేష్.. చంటి లాంటి చిత్రంలో అమాయకుని పాత్రనూ పోషించారు. రాజా, మల్లీశ్వరి, వసంతం, సంక్రాతి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం సంపాదించుకున్నారు.  

సంక్రాంతికి మామా అల్లుళ్ల సందడి...
అల్లుడు నాగచైతన్యతో కలిసి విక్టరీ వెంకటేశ్ చేసిన మల్టీ స్టారర్ వెంకీమామ సినిమా కూడా ఆయన పుట్టినరోజునాడే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మరో విశేషం. వెంకీమామగా ఆడియెన్స్‌ని అలరిస్తోన్న విక్టరీ వెంకటేష్‌కి హ్యాపీ బర్త్ డే. 

Trending News