సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సెక్సువల్ హరాష్మెంట్ కథాశంగా తీసుకొని రూపొందిన డియర్ కామ్రేడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ మూవీ చూసిన అమ్మాయిలందరూ విజయ్ లాంటి కామ్రేడ్ ఉంటే ఎంత బాగుంటది అనేంత స్థాయిలో ఇంపాక్ట్ వేశాడు విజయ దేవరకొండ. ఇలా ఈ ఒక్క మూవీతో అమ్మాయిల మదిని దోచేసి..ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకున్నాడు కామ్రేడ్ విజయ్.
3 రోజుల్లో భారీ గా పైసా వసూల్..
విజయ్ దేవరకొండ లెటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. మొదటి 3 రోజుల్లో కేవలం తెలుగు వెర్షన్ కే 19 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఏపీ, నైజాం, ఓవర్సీస్ తో పాటు కర్నాటకలో తెలుగు వెర్షన్ కు వచ్చిన మొత్తం ఇది. ఇక నాలుగు భాషల్లో కలెక్షన్స్ ఇంకా బయటపెట్టలేదు.. దీంతో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఇది.
ఏపీ, నైజాం 3 రోజుల షేర్ ఇదే..
నైజాం – రూ. 5.65 కోట్లు
గుంటూరు – రూ. 1.03 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు
కృష్ణా – రూ. 0.73 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.56 కోట్లు
ఈస్ట్ – రూ. 1.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.83 కోట్లు
సీడెడ్ – రూ. 1.08 కోట్లు