దాసరి నారాయణరావు పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ మేటి దర్శకుడు..?

  

Last Updated : Nov 2, 2018, 12:04 PM IST
దాసరి నారాయణరావు పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ మేటి దర్శకుడు..?

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే అనేక కీలకపాత్రల కోసం పలువురు వ్యక్తులను ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రకు రానా దగ్గుబాటి, శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రకు విద్యా బాలన్ మొదలైన వారిని తీసుకున్నారు.  అలాగే నందమూరి హరిక్రిష్ణ పాత్రను కళ్యాణ్ రామ్, హెచ్ ఎం రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ నటిస్తున్నారు.

అదేవిధంగా అక్కినేని పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం వీరందరి సరసన మరో వ్యక్తి కూడా చేరబోతున్నారు. ఆయనే వి.వి.వినాయక్. ఆది, ఠాగూర్, సింహాద్రి లాంటి మేటి హిట్స్ ఇచ్చిన వి.వి.వినాయక్, ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు పాత్రలో నటిస్తున్నారని సమాచారం. అయితే నిర్మాతలు ఇంకా ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా.. సాయి కొర్రపాటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ చిత్రానికి దర్శకుడిగా తేజను అనుకున్నా.. తర్వాత ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు.  ఆయనకు బదులుగా బాధ్యతలు స్వీకరించిన క్రిష్.. ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తు్న్నారు.

Trending News