ఆకట్టుకుంటున్న సల్మాన్ 'భారత్' టీజర్ (వీడియో..)

ఆకట్టుకుంటున్న సల్మాన్ 'భారత్' టీజర్ (వీడియో..)

Last Updated : Aug 15, 2018, 04:29 PM IST
ఆకట్టుకుంటున్న సల్మాన్ 'భారత్' టీజర్ (వీడియో..)

బాలీవుడ్ నటుడు సల్మాన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'భారత్'. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని 'భారత్' చిత్రం టీజర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. సల్మాన్ ఖాన్ 'భారత్' టీజర్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇండియా మ్యాప్ చూపిస్తూ.. బ్యాక్ గ్రౌండ్‌లో సల్లూ భాయ్ చెప్పే డైలాగులతో టీజర్ సాగిపోతుంది. 1940ల్లో భారతదేశం, దేశ విభజన సందర్భంగా ఎదురైన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

యాక్షన్, డ్రామా, మ్యూజిక్ సమ్మిళితమై కొరియా మూవీ ఓడ్ టు మై ఫాదర్ అనే సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు, దేశ విభజన సమయంలో నాటి పరిస్థితుల కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు, ఈ సినిమాలో సల్మాన్ ఐదు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది. భారత్ సినిమాను అబుదాబి, స్పెయిన్, ఢిల్లీతో పాటు దేశ విభజన సన్నివేశాలు పంజాబ్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.

కాగా భారత్‌లో సల్మాన్‌తో పాటు కత్రినా కైఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్, నోరా ఫతేహి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ (రంజాన్)కు రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు అనుకుంటున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాను రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

 

Trending News