How To Lose Weight Fast Naturally And Permanently: చాలా మంది బరువు తగ్గడానికి కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. మరికొందరతై మార్కెట్లో ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల బరువు తగ్గిప్పటికీ తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గడానికి వీటన్నింటికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ వాటర్ ఫ్రూట్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు సులభంగా ఊబకాయం సమస్యలను తగ్గిస్తుంది.
వాటర్ చెస్ట్నట్ ఉండే పోషకాలు ఇవే:
వాటర్ చెస్ట్‌నట్‌లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా శరీర బరువు నియంత్రించే గుణాలు కూడా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఆహారంలో వాటర్ చెస్ట్నట్ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కాల్షియం, విటమిన్-ఎ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
వాటర్ చెస్ట్నట్ పిండిని కూడా వినియోగించవచ్చు:
వాటర్ చెస్ట్నట్ పిండితో తయారు చేసిన ఆహారాలు శరీరానికి ప్రభావంతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ పిండితో తయారు చేసిన రోటీలను ప్రతి రోజు డైట్లో భాగంగా తీసుకుంటే సులభంగా ఊబకాయం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వాటర్ చెస్ట్నట్ పిండితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల కలిగే లాభాలు:
✺ ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. అయితే వాటర్ చెస్ట్నట్ పిండిలో విటమిన్ B6, పొటాషియం, అయోడిన్ లభిస్తాయి. దీని కారణంగా థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
✺ అల్పాహారంలో ఈ పిండితో తయారు చేసిన రోటీలు, పూరీలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
✺ వాటర్ చెస్ట్నట్ పిండిలో పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి