దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ సినిమా యాత్ర షూటింగ్ ముగిసినట్టు తెలుస్తోంది. ఆఖరిలో కొన్ని చిన్నచిన్న ప్యాచ్ వర్క్ మినహాయించి సినిమాలో మెజార్టీ షూటింగ్ పూర్తయినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్ర పోషిస్తున్నాడు. వైఎస్సార్ బాల్యం నుంచి మొదలుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు చేపట్టిన పాదయత్ర, ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు చేరువైన వైనం వంటి అంశాలెన్నో ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నేత రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో యాత్ర బయోపిక్‌పై ఆయన అభిమానుల్లో అంతే భారీ స్థాయిలో అంచనాలున్నాయి.
70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చల్లా, శేషి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది.