Acidity Home Remedies: ఆహారాలు ఇష్టపడేవారు తరచుగా తింటూ ఉంటారు. దీని కారణంగా చాలా మంది కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు అతిగా తినడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల, వేయించిన లేదా కుళ్ళిన ఆహారం తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యల బారిపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, అసిడిటీ చిటికెలో ఉపశమనం పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గ్యాస్, అసిడిటీని ఇలా వదిలించుకోండి:
గ్యాస్, అసిడిటీ, ఇతర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హోం రెమెడీని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో అసిఫెటిడా, బ్లాక్ సాల్ట్ తీసుకోండి. రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకుని నీటి కలిపి తాగాల్సి ఉంటుంది. ఇలా ఇంగువ, నల్ల ఉప్పు కలిపిన నీరు ప్రతి రోజూ తాగడం వల్ల కడుపులోన సమస్యలు సులభంగా దూరమవుతాయని, ముఖ్యంగా గ్యాస్, పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే ఇదే నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అజీర్తి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిట్కాలను కూడా వినియోగించండి:
>>బ్లాక్ సాల్ట్ కాకుండా ఎసిడిటీ, గ్యాస్‌ను తొలగించడానికి ఇతర చిట్కాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సోంపు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం ప్రతి ఒక చెంచా సోంపు గింజలను వేసి 3 నుండి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత వాటిని తాగాల్సి ఉంటుంది.
>>అల్లం టీ కూడా గ్యాస్, ఎసిడిటీని కూడా తొలగించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
>>మజ్జిగ కూడా అసిడిటీ సమస్యల నుంచి ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
>>పుదీనా ఆకులు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పుదీనా ఆకుల రసాన్ని తాగాల్సి ఉంటుంది.
Also Read: Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న బంగారం ధరలు..!
Also Read: YSRCP: చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ డిమాండ్.. సరికొత్త నిరసనకు పిలుపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి