/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Home Isolation: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజువారీ కేసులు నాలుగు లక్షలు దాటుతున్నాయి. స్వల్ప లక్షణాలున్నవారు హోం ఐసోలేషన్‌కే పరిమితమవుతున్నారు. ఐసోలేషన్ తరువాత ఏం చేయాలనేది ఆసక్తిగా మారింది. 

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)దేశంలో భయంకరంగా విజృంభిస్తోంది. రెండ్రోజుల్నించి కేసుల సంఖ్య 4 లక్షలు దాటుతోంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు భయానకమవుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ పరిస్థితి దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయి. ఫలితంగా ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సరఫరా ( Oxygen Shortage) అందక రోగులు అవస్థలు పడుతున్నారు. వైరస్ సోకినా కొందరికి లక్షణాలుండటం లేదు. మరి కొందరికి స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో( Home Isolation)చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు కూడా ఇదే ఉత్తమమని అంటున్నారు.శ్వాస తీసుకోవడంలో సమస్యలుండి..ఇతర అనారోగ్య సమస్యలుంటేనే వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకోవాలని అంటున్నారు.

స్వల్ప లక్షణాలు ఉండి ఇతర సమస్యలు లేకపోతే హోం ఐసోలేషన్‌లో కోలుకోవచ్చని చెబుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉంటూనే లక్షలాదిమంది కోలుకున్నట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే హోం ఐసోలేషన్ తర్వాత ఏం చేయాలి, ఇంకోసారి కోవిడ్‌ నిర్ధారణ టెస్ట్‌ చేయించుకోవాలా..? వద్దా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అయితే, ఇలాంటి సందేహాలపై ఎయిమ్స్‌(AIIMS) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా వివరణ ఇచ్చారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిలో ఏడు రోజుల్లో వైరస్ చచ్చిపోతుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. అప్పటినుంచి ఇతరులకు వ్యాపించదని అన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు (RTPCR Test) రెండు మూడు వారాల తర్వాత కూడా వైరస్ ఉనికిని గుర్తించగలుగుతాయని చెప్పారు. వైరస్ సోకి పది రోజులు పూర్తయ్యాక జ్వరం లేకపోతే మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని వివరించారు.

Also read: Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
After home isolation, what to do , what not to do, recommendation by Aiims
News Source: 
Home Title: 

Home Isolation: హోం ఐసోలేషన్ తరువాత ఏం చేయాలో తెలుసా

Home Isolation: హోం ఐసోలేషన్ తరువాత ఏం చేయాలో తెలుసా
Caption: 
Home isolation guidelines ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Home Isolation: హోం ఐసోలేషన్ తరువాత ఏం చేయాలో తెలుసా
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, May 2, 2021 - 14:33
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
94
Is Breaking News: 
No