Apple Juice For Weight Loss: శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ప్రతి రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శరీర అభివృద్ధి సక్రమంగా జరగడానికి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే యాపిల్ పండ్లను ప్రతి రోజూ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ పండ్లతో తయారు చేసిన జ్యూస్ తాగితే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే యాపిల్ జ్యూస్‌ను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
>>ఆపిల్ జ్యూస్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగితే మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.
>>అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ జ్యూస్ ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సులభంగా నియంత్రణలో ఉంటుంది.
>>ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఆస్తమా సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది.
>>అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ యాపిల్ జ్యూస్ చాలా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ను తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
>>యాపిల్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే యాపిల్స్‌లో విటమిన్ ఎ అధిక పరిమాణంలో లభిస్తుంది. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ జ్యూస్ తాగడం చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ
Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook