Avocado Effect On Ldl Cholesterol: అవకాడోలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు విచ్చల విడిగా లభిస్తాయి. అయితే ఈ పండు భారతదేశ వ్యాప్తంగా ఇటీవలే ప్రజాదరణ పొందింది. ఇందులో విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి, ఇ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ తినడం వల్ల గుండె జబ్బులను దూరంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. . జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం.. అవకాడోలో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించే చాలా రకాల గుణాలు ఉన్నాయి. అయితే దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అవోకాడో కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రిస్తుందో తెలుసా?
కొలెస్ట్రాల్ అనేది కాలేయం అభివృద్ధి చేసే ఒక పదార్థం. ఇది శరీరంలో రెండు రకాలుగా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే మంచి కొలెస్ట్రాల్ పెరిగితే బాడీకి చాలా మంచిది. కొలెస్ట్రాల్ శరీరంలో ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ప్రభావితం చేస్తుంది.
శరీరంలో లిపోప్రొటీన్ (HDL) అధిక సాంద్రతతో కలిగి ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. అయితే ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
పాల ఉత్పత్తులు, గుడ్లు, పౌల్ట్రీ, మాంసం, సంతృప్త కొవ్వులు అధికంగా తీసుకోవడం వల్ల ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్‌లు పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా చాలా రకాల గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అవకాడోలను తీసుకోవడం వల్ల HDL కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఎందుకంటే ఇందులో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే మోనోశాచురేటెడ్ కొవ్వులు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా వీటిలో సి, కె వంటి విటమిన్లు కూడా అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి శరీరంలో ఫైటోస్టెరాల్స్, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అవోకాడోలో ఉండే గుణాలు ఆక్సీకరణం చెందిన LDL కణాలను తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!
Also Read: Nandamuri Taraka Ratna Health: నందమూరి అభిమానులకు షాక్.. తారకరత్నకు మరో అరుదైన వ్యాధి గుర్తింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook