Back pain: వెన్నునొప్పి, మజిల్ ర్యాంప్స్ సమస్యకు పరిష్కారమిదే..మీ డైట్‌లో చేర్చుకోండి

Back pain: నిత్య జీవితంలో..పోటీ ప్రపంచంలో వెన్నునొప్పి, మజిల్ క్రాంప్స్ సర్వ సాధారణంగా మారాయి. నిరంతరం ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కొన్నిరకాల ఆహార పదార్ధాలతో ఈ సమస్యల్నించి విముక్తి పొందవచ్చంటున్నారు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2022, 12:42 PM IST
Back pain: వెన్నునొప్పి, మజిల్ ర్యాంప్స్ సమస్యకు పరిష్కారమిదే..మీ డైట్‌లో చేర్చుకోండి

Back pain: నిత్య జీవితంలో..పోటీ ప్రపంచంలో వెన్నునొప్పి, మజిల్ క్రాంప్స్ సర్వ సాధారణంగా మారాయి. నిరంతరం ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కొన్నిరకాల ఆహార పదార్ధాలతో ఈ సమస్యల్నించి విముక్తి పొందవచ్చంటున్నారు..

ఆధునిక జీవనశైలితో పలు అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు కావచ్చు లేదా ఒత్తిడి కావచ్చు..బ్యాక్ పెయిన్స్, ఎముకలు-కండరాల సమస్యలు , మజిల్ క్రాంప్స్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఎదుర్కొనే ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నాం. 

ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్యాక్ పెయిన్, ఎముకలు ,కండరాల సమస్యలు యుక్త వయస్సులోనే ఎదురవుతున్నాయి. సహజ సిద్ధంగా కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్ధాల్ని రోజూ తీసుకోవడం ద్వారా ఆ సమస్యల్నించి దూరం కావచ్చు. ఈ సమస్యలు దూరం కావాలంటే కావల్సిది విటమిన్ డి, కాల్షియం ప్రధానం. ఈ రెండింటి వల్ల ఎముకలు ఆరోగ్యంగానే కాకుండా ధృడ నిర్మాణానికి దోహదమవుతుంది. శరీరంలోని ఎముకలు, కండరాలకు పటిష్టత చేకూర్చే ఆహారపదార్ధాలు ఇవి.

అరటిపండులో కీలకమైంది. కేవలం జీర్ణప్రక్రియకే కాకుండా శరీరానికి కావల్సిన మెగ్నీషియం, ఇతర విటమిన్లను సమకూర్చుతుంది. రోజుకో అరటిపండుతో ఎముకలకు బలం కలుగుతుంది. ఇక రెండవది డ్రై ఫ్రూట్స్‌. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఎముకలు కాల్షియంను పీల్చుకోవడానికి,  నిల్వ ఉండటానికి మెగ్నీషియం ఎంతో సహాయపడుతుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రకారం..శరీరంలోని మొత్తం పొటాషియంలో కేవలం దంతాలు, ఎముకలే 85 శాతం ఉపయోగించుకుంటాయి.

ఇక పాల ఉత్పత్తులు ఎముకలు, కండరాలకు చాలా మంచివి. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఒక కప్పు పాలు లేదా పెరుగు రోజూ తీసుకుంటే శరీరానికి కావల్సినంత కాల్షియం అందుతుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెబుతోంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎముకల పుష్టికి చాలా దోహదపడతాయి. కొవ్వు అధికంగా ఉండే చేపల ఫ్రై, కర్రీ లేదా పులుసు ఎలా తీసుకున్నా ఫరవాలేదు. సాధారణంగా 35 ఏళ్ల వరకే ఎముకల అభివృద్ధి అనేది జరుగుతుంటుంది. ఆ తరువాత ఎముకలు అరిగిపోవడం లేదా క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకే బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలతో సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవచ్చు.

ఇక మరో ముఖ్యమైన ఆహారం పాలకూర. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజూ ఆకు కూరలు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా, పటిష్టంగా తయారవుతాయి. ఒక కప్పు ఉడికించిన పాలకూరలో ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే కాల్షియంలో 25 శాత సమకూరుతుందని అంచనా. ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. 

ఇక పండ్ల విషయంలో ఆరెంజ్‌ కీలకమైంది. ఆరెంజ్‌ జ్యూస్‌ రూపంలో అయినా లేదా నేరుగా అయినా తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి. ఆరెంజ్‌లో ఉండే కాల్షియం, విటమిన్‌ డి ఎముకలకు బలం చేకూర్చుతాయి. ఇక బొప్పాయి గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇందులోని కాల్షియం స్థాయి చాలా ఎక్కువ.100 గ్రాముల బొప్పాయి ముక్కలు తింటే 20 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also read: Betel Leaves Fitness Tips: మీరెప్పుడైనా తమలపాకు నమిలి తిన్నారా? దీనిని తినడం ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x