Belly Fat Loss Drink: ఈ డ్రింక్ తాగితే కేవలం నెల రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది!

Belly Fat Loss Drink: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను పాటించండి. ఈ చిట్కాలను పాటిస్తే.. ఏకంగా నెల రోజుల్లో మీ బెల్లీ ప్యాట్ తగ్గిపోతుంది. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు వాడాల్సిన వంటింటి చిట్కాలు ఏవో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 03:52 PM IST
Belly Fat Loss Drink: ఈ డ్రింక్ తాగితే కేవలం నెల రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది!

Belly Fat Loss Drink: నేటి జీవనశైలి, ఆహరపు అలవాట్ల వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుత ఉరుకుల, పరుగుల కాలంలో వ్యాయామం చేసేందుకు కూడా తగిన సమయం ఉండడం లేదు. అయితే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల అధికంగా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. స్థూలకాయం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు లేకపోలేవని చెబుతున్నారు. కానీ, అలా అధిక బరువు కలిగిన వారు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం 30 రోజుల్లోనే బరువును సులభంగా తగ్గేందుకు మార్గం ఉంది. బరువు తగ్గేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏవో తెలుసుకుందాం. 

బెల్లీ ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవాలి?

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉండే వాము వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే అవకాశం ఉంది. వాము గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని తాగాలి. దీని వల్ల పొట్టపై కొవ్వు తగ్గుతుంది. వాములోని థైమోల్ కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తుంది. 

జీర్ణక్రియ మెరుగ్గా..

వాము తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో పాటు ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. వాము నీటిలో అయోడిన్, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. 

కీరదోసకాయతో మేలు..

కీరదోసకాయ నీటిని తాగడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు నయమవుతాయి. మలబద్ధకం కూడా నయమవుతుంది. గ్యాస్, ఆస్తమాతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు వాము నీటిని నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల 3 నుంచి 4 కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది.  

Also Read: Hair Fall Treatment: రోజూ ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే జుట్టు ఎప్పటికీ రాలిపోదు!

Also Read: Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ తాగితే ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పవు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News