Summer Care: డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి

Summer Care: వేసవి మండుతోంది. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. వేసవి సమయంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్ ఎలా ఉండాలి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 30, 2022, 02:56 PM IST
  • వేసవికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవల్సిన ప్రత్యేక జాగ్రత్తలేవి
  • వేసవికాలంలో డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు
  • డయాబెటిక్ పేషెంట్లు బాడీ హైడ్రేట్‌గా ఉంచుకోవడం తప్పనిసరి
 Summer Care: డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి

Summer Care: వేసవి మండుతోంది. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. వేసవి సమయంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్ ఎలా ఉండాలి..

దేశంలో అత్యధికంగా పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఏడాది పొడుగునా ప్రతి సీజన్‌లోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో మరింతగా. ఎందుకంటే వేసవిలో తరచూ ఎదురయ్యే ప్రధాన సమస్య డీహైడ్రేషన్. డయాబెటిస్ ఉన్నవాళ్లు డీహైడ్రేషన్‌కు గురైతే సమస్య అధికమౌతుంది. అందుకే డైట్ పరంగా వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యంలో ఎగుడు దిగుడు లేకుండా ఉండాలంటే. కొన్ని టిప్స్ పాటించాల్సిందే. లేకపోతే ఎండాకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ కష్టమే. అందుకే వేసవిలో మధుమేహంతో బాధపడేవారు డైట్ మార్చుకోవాలి.

వేసవి నుంచి ఉపశమనం కోసం వివిధ రకాల టెట్రాప్యాక్ జ్యూస్‌లు తీసుకుంటుంటారు. కానీ ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తాజా పండ్లు ఇంట్లో ఉంచుకుని ఆ రసం తాగితే చాలామంచిది.

ఇక డయాబెటిస్ రోగులు ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యకరమైన ఆహారంతో రోజు ప్రారంభిస్తే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అందుకే బ్రేక్‌‌ఫాస్ట్‌లో మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఫలితంగా ఎక్కువగా ఆకలి వేయదు. ఓట్స్, దలియా, యాపిల్, నేరేడు పండ్లను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

వేసవికాలం అంటేనే మామిడపండ్లు గుర్తొస్తాయి. అత్యంత రుచికరమైన మామిడిపండ్లు డయాబెటిస్ రోగులకు విషంతో సమానం. ఇందులో షుగర్ లెవెల్స్ అత్యధికంగా ఉంటాయి. అటు దానిమ్మ, ఖర్బూజ పండ్లను కూడా దూరం పెడితే మంచిది. ఇక వేసవిలో ఉక్కపోత కారణంగా చెమట అత్యధికంగా బయటకు పోతుంది. ఈ క్రమంలో శరీరాన్ని హైడ్రైట్‌గా ఉంచుకోవల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో నీళ్లు తగ్గితే..డయాబెటిస్ రోగులకు కళ్లు తిరగడం, బలహీనత ఎదురౌతాయి. ఎక్కువ నీళ్లు తీసుకుంటే శరీరంలోని విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి.

Also read: Bay Leaves Medicinal Value: బే (బిర్యాని ఆకులు) ఆకుతో కలిగే ప్రయోజనాలు..ఈ 5 వ్యాధులకు దివ్యౌషధం..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News