Bay Leaves Medicinal Value: భారతదేశంలోని దాదాపు ప్రతి వంటిట్లో బే (బిర్యాని ఆకులు) ఆకులు ఉంటాయి. ఇవి మాంసాహారానికే కాకుండా శాఖాహారానికి కూడా చక్కని రూచిని ఇస్తాయి. దీని వల్ల ఆహారానికి చక్కని రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను అందజేస్తాయి. ఇందులో చాలా ఔషధ లక్షణాలున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ ఆకులో అనేక వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలున్నాయని వెల్లడించారు. శరీరానికి మేలు చేసే పొటాషియం, కాపర్, మెగ్నీషియం జింక్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ మసాలా ఏయే వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బే (బిర్యాని ఆకులు) ఆకుల 5 ప్రయోజనాలు:
1. మానసికంగా ఆరోగంగా ఉండేందుకు మేలు చేస్తుంది:
బే ఆకులు మానవ శరీరాని ఎంతో మేలు చేస్తాయని.. మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. ప్రతి రోజు మనుషులు ఏదో ఒక టెన్షన్‌తో ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. అయితే ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు...రాత్రి పడుకునే ముందు 2 ఆకులను తీసుకొని దానిని కాల్చి గదిలో ఉంచడం వల్ల దాని లోంచి వచ్చే పొగ కారణంగా ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
ప్రస్తుతం కోవిడ్ వల్ల చాలా మంది శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. ఖచ్చితంగాఈ బే ఆకులను తినడం వల్ల ఉపసమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను నీటిలో మరిగించి వాటిలో గుడ్డతో ముంచి ఛాతీపై ఉంచితే శ్వాస సమస్య దూరమవుతాయని తెలిపారు.
3. అలసట నుండి ఉపశమనం:
మానవుడు పనిలో నిమగ్నమై రోజు అలసిపోతూ ఉంటారు. అయితే ఈ బే ఆకులను ఉపయోగించి అరోమాథెరపీ చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. ఈ బే ఆకులో ఉండే సుగంధ పూరిత వాసన మానవుని అలసను పోగొడుతుంది.
4. డయాబెటిస్‌పై ప్రభావవం:
ఈ బే ఆకు టైప్- 2 డయాబెటిస్ రోగులకు మంచి ఔషధంలా పని చేస్తుంది. అంతేకాకుండా వ్యాధిపై చాలా ప్రభావం చూపుతుంది. ఆకులో ఉండే గుణాల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
5. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది:
బే ఆకులు చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా జలుబు, ఫ్లూ వంటి జబ్బుల నుంచి కాపాడుతుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా వైద్య శాస్త్రం నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Record Heat Wave In Delhi: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..!!
Also Read: Tamil Nadu to aid Srilanka: శ్రీలంకకు సాయం చేస్తాం.. కేంద్రం అనుమతి కోరిన
రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.