BF.7 Variant In India: బిఎఫ్7 వేరియంట్ ఇండియాను ఏమీ చేయలేదట.. ఎందుకంటే..

BF.7 Variant In India: ఒమిక్రాన్ బిఎఫ్7 వేరియంట్ కేసులు చైనాను వణికిస్తున్నాయి. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి కారణం ఈ ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్ కేసులే అనే సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే గుణం ఉన్న ఈ బిఎఫ్. 7 వేరియంట్ వల్లే చైనాలో అతి కొద్ది కాలంలోనే ఫోర్త్ వేవ్ భయం గడగడలాడిస్తోంది.

Written by - Pavan | Last Updated : Dec 26, 2022, 07:32 AM IST
BF.7 Variant In India: బిఎఫ్7 వేరియంట్ ఇండియాను ఏమీ చేయలేదట.. ఎందుకంటే..

BF.7 Variant In India: ఒమిక్రాన్ బిఎఫ్7 వేరియంట్ కేసులు చైనాను వణికిస్తున్నాయి. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి కారణం ఈ ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్ కేసులే అనే సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే గుణం ఉన్న ఈ బిఎఫ్. 7 వేరియంట్ వల్లే చైనాలో అతి కొద్ది కాలంలోనే ఫోర్త్ వేవ్ భయం గడగడలాడిస్తోంది. చైనాలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ పరిస్థితిని చూసి యావత్ ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాలకు కరోనా వ్యాపించకముందే మేల్కోవాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అందులో భాగంగానే రెండేళ్ల క్రిందటి తరహాలోనే ప్రయాణాలపై, రద్దీ ప్రదేశాల్లో ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 

భారత్ కూడా అందుకు అతీతమేమీ కాదు. భారత్ సైతం చైనాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను చూసి అప్రమత్తమైంది. ఆక్సీజన్ ప్లాంట్స్, వెంటిలేటర్స్, బెడ్స్, మెడిసిన్, వైద్యులు, పారామెడికల్ స్టాఫ్ కొరత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టంచేసింది. ఒకవైపు దేశం అంతా కరోనా రాకముందే అప్రమత్తమవుతున్న ఈ తరుణంలోనే మరోవైపు " కరోనా కొత్త వేరియంట్ చైనాలో చూపించినంత ప్రభావం భారత్‌లో చూపించకపోవచ్చు " అని సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయోలజీ డైరెక్టర్ (సిసిఎంబీ) వినయ్ కే నందికూరి అభిప్రాయపడ్డారు. 

బిఎఫ్. 7 వేరియంట్ చైనాలో సృష్టిస్తున్నంత అలజడి ఇండియాలో సృష్టించకపోవచ్చు అని వినయ్ కే నందికూరి చెబుతున్నారు. అందుకు వినయ్ చెబుతున్న కారణం ఏంటంటే.. ఇప్పటికే ఇండియాలో హెర్డ్ కమ్యునిటీ వచ్చేసిందని అన్నారు. డెల్టా వేరియంట్ లాంటి పెద్ద వైరస్ నే భారత్ తట్టుకుని నిలబడింది. డెల్టా వేరియంట్ వచ్చినప్పుడే భారతీయులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తరువాత ఒమిక్రాన్ వేరియంట్ దాడి చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తరువాత భారతీయులు బూస్టర్ డోస్ తీసుకున్నారు. చైనాతో పోలిస్తే.. భారత్ లో వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగనే ఉంది. అలా ఏ విధంగా చూసుకున్నా చైనా కంటే మనమే ముందున్నాం. అందుకే చైనా ఎదుర్కొంటున్న సమస్య భారత్ కి రాకపోవచ్చు అని వినయ్ ధీమా వ్యక్తంచేశారు.

చైనా పాటించిన జీరో కొవిడ్ పాలసీ చైనాలో కొవిడ్ కేసులు పెరగడానికి ఒక కారణం కాగా.. వ్యాక్సినేషన్ తీసుకున్న వారి సంఖ్య కూడా తక్కువగానే ఉండటం మరో కారణంగా వినయ్ చెప్పుకొచ్చారు. చైనాలో అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికే 37 లక్షల మందికి కరోనా సోకింది. భారత్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్‌లో 4 ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం దేశంలో కొత్తగా 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య మొత్తం 3,397 కి చేరింది.

ఇది కూడా చదవండి : Covid 4th Wave in India: కొవిడ్ ఫోర్త్ వేవ్ రానుందా ? కేంద్రం ఏం చెబుతోంది ?

ఇది కూడా చదవండి : India's COVID Cases: దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్

ఇది కూడా చదవండి : BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News