Black Salt Benefits: ఉప్పు సరైన మోతాదులో ఉంటేనే ఆహారాలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. కానీ కొంతమంది అతిగా ఉప్పును తింటున్నారు. అందులో అయోడిన్ కలిగిన తెల్ల ఉప్పును ఎక్కువగా తింటున్నారు. ఇలా అధిక మోతాదులో ఉప్పును తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుతోపాటు తీవ్ర గుండె సమస్యలు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవలే కొన్ని పరిశోధనలు తెల్ల ఉప్పుపై ఆసక్తికరమైన సమాచారాన్ని తెలిపాయి. తెల్ల ఉప్పును అతిగా తినేవారు త్వరగా తీవదీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి ఈ తెల్ల ఉప్పు బై బై చెప్పి రాక్ సాల్ట్ లేద బ్లాక్ సాల్టన్ వినియోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మనం ప్రతిరోజు ఆహారాల్లో బ్లాక్ సాల్ట్ ను వినియోగించడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే అనేక రకాల ఆయుర్వేద గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి చిన్న వయసులోనే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నల్ల ఉప్పుని వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెల్ల ఉప్పును పొటాషియంతో పాటు మెగ్నీషియం కూడా అధిక పరిమాణం లో లభిస్తుంది. కాబట్టి ఉదయం పూట ఈ ఉప్పును నీటిలో కలుపుకొని తాగడం వల్ల పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?
బ్లాక్ సాల్ట్ ను మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప్పులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తాయి. ఏ కాకుండా మధుమేహంతో బాధపడుతున్న వారు ఉదయం ఖాళీ కడుపుతో మూడు చిటికెల ఒప్పును ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినేవారిలో సులభంగా పొట్ట సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అతిగా ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్టలోని గ్యాస్ సమస్యల బారిన పడతారు. ఈ సమస్య బారిన పడినవారు ఎలాంటి పనులు చేయాలన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. తరచుగా గ్యాస్ సమస్యలను ఎదుర్కొనేవారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో బ్లాక్ సాల్ట్ ను నీటిలో కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యలు తగ్గడమే కాకుండా.. జీర్ణ క్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నల్ల ఉప్పును యాంటీ డాండ్రఫ్ గా కూడా వినియోగించవచ్చట. ఈ ఉప్పునీటిని చుండ్రు సమస్యలతో బాధపడుతున్న వారు జుట్టుకు అప్లై చేస్తే సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుందట.
Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook