Blood Increase Foods: ఆధునిక జీవనశైలిని అనుసరించే వారిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా చాలామందిలో రక్తహీనతతో పాటు శరీరంలో రక్తం తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇవి చిన్న సమస్యలే కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీని కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. శరీరంలో తగిన పరిమాణంలో రక్తం లేకపోవడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. రక్తహీనత సమస్యలు అనేది ఎక్కువగా పురుషులతో పోలిస్తే మహిళల్లోనే వస్తోంది. అంతేకాకుండా ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లలను కూడా ఈ సమస్య వస్తోంది. అయితే ఈ సమస్య రాకుండా ఉండడానికి, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఉదయం పూట ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ క్రింది ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇతర వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని నిపుణులు అంటున్నారు.
రక్త సమస్యలు ఉన్నవారు తప్పకుండా తినాల్సిన ఆహారాలు:
పచ్చని కూరలు:
వారంలో ఒక రోజైనాపాలకూర, బచ్చలికూర, మెంతులు, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రక్త సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వారంలో రెండు రోజులైనా తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఆకుకూరల్లో ఐరన్, ఫోలెట్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ఉత్పత్తికి చేయడానికి ఎంతగానో సహాయపడతాయి.
కాలేయం:
కోడి, మేకల కాలేయంలో ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. అంతేకాకుండా ఇది తినడం వల్ల శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. కాబట్టి రక్త కోరత ఉన్న ప్రతి ఒక్కరు కాలేయాన్ని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ బి12, కాపర్, విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటాయి. వారంలో ఒక రోజైనా తినడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు మెరుగుపడతాయి.
రెడ్ మీట్:
పొట్టేలు మేక మాంసం లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్ జింక్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి వారంలో ఒకటి నుంచి రెండుసార్లు మేక మాంసం తినడం వల్ల రక్తం ఉత్పత్తి అవుతుంది. అలాగే ఇప్పటికే రక్త సమస్యలు ఉన్నవారికి సులభంగా తొలగిపోతాయి.
చేపలు:
అలాగే శరీరంలోని రక్తం పెరగాలంటే సాల్మన్, ట్యూనా, సార్డిన్స్ వంటి చేపలు కూడా తినొచ్చు. ఇందులో శరీరానికి కావలసిన ఐరన్, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం పెరిగే అవకాశాలున్నాయి అంతేకాకుండా అనారోగ్య సమస్యల కారణంగా రక్తం అనారోగ్య సమస్యల కారణంగా రక్తం గడ్డ కడితే నిరోధించే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
గుడ్లు:
గుడ్లు కూడా శరీరంలోని రక్తాన్ని పెంచేందుకు గణాల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజు ఒకటి నుంచి రెండు గుడ్లను తినమని సూచిస్తారు. ఈ గుడ్లలో ఐరన్, విటమిన్ B12, ఫోలెట్, ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తినడం వల్ల కణాల నిర్మాణం బాగుంటుంది. దీంతోపాటు రక్త సమస్యలు కూడా తగ్గుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
పప్పుధాన్యాలు:
ప్రతిరోజు శనగలు, బఠానీలు, మసూరపప్పు వంటి పప్పుధాన్యాలు తినడం వల్ల కూడా రక్త సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వీటిల్లో శరీరానికి కావలసిన ఐరన్, ఫోలెట్, ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా యాక్టివ్‌గా ఉంటుందని ఆరోగ్య నిపు చెపుతున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని వారంటున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి