Bottle gourd Health benefits: సొరకాయ కూరగాయ వీటిని సాంబార్లో, పప్పులో వేసుకొని తయారు చేసుకుంటారు. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులో చల్లని అనుభూతిని కలిగిస్తుంది. సొరకాయను ఎండకాలం డైట్లో చేర్చుకుంటే నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటో తెలుసుకుందాం.
ఇదీ చదవండి:
సొరకాయ ను డైట్ లో చేర్చుకుంటే ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి రోజంతటికీ కావలసిన హైడ్రేషన్ మనకు అందిస్తుంది సొరకాయను ఎండాకాలం ప్రతిరోజు మన డైట్ లో చేర్చుకుంటే నీటి శాతం శరీరంలో నియంత్రణలో ఉంటాయి.
బరువు నిర్వహణ..
సొరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి దీంతో బరువు పెరగకుండా ఉంటారు ఫైబర్ వల్ల కడుపు నిండిన అదుపుతూ కనిపిస్తుంది దీంతో ఎక్కువ తినకుండా ఉంటారు.
ఇదీ చదవండి: నిమ్మకాయ రసంతో 5 ఆరోగ్య లాభాలు.. ఎండకాలం ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకవుతారు..
జీర్ణ ఆరోగ్యం..
జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టి ఆరోగ్యకరమైన జీర్ణ క్షయానికి తోడ్పడుతుంది.
పోషకాల గని..
సొరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి ఇవి శరీర పని తీరుకు తోడ్పడతాయి ఆరోగ్యకరమైన ఎముకలకు ఇమ్యూనిటీ వ్యవస్థకు బ్లడ్ ప్రెజర్ కు నిర్వహిస్తాయి.
డిటాక్సిఫికేషన్..
సొరకాయను డైట్ లో చేర్చుకుంటే ఇందులో డైరుటిక్ గుణాలు ఉంటాయి ఇది శరీరంలోని టాక్సిన్స్ ని బయటికి పంపించేస్తుంది డీటాక్స్ఫికేషన్ చేస్తుంది.
గుండె ఆరోగ్యం..
సొరకాయలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించింది, పొటాషియం బిపిని నిర్వహిస్తుంది విటమిన్ సి లో ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఇదీ చదవండి: మందార టీ అంటే ఏమిటి? దీంతో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?
చర్మ ఆరోగ్యం..
సొరకాయను అంటే ఆక్సిడెంట్లు నీటి శాతం అధికంగా ఉంటుంది దీంతో స్కిన్ సమస్యలకు చెక్ పెడుతుంది ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల అయ్యే డ్యామేజ్ ను నివారిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter