Hibiscus Tea Benefits: మందార టీ అంటే ఏమిటి? దీంతో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?

Hibiscus Tea Benefits: మందార టీ హెర్బల్ టీ. ఇందులో రిలాక్సింగ్‌ గుణాలు ఉంటాయి. మందారలో ఆంథోసైనిన్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 28, 2024, 02:25 PM IST
Hibiscus Tea Benefits: మందార టీ అంటే ఏమిటి? దీంతో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?

Hibiscus Tea Benefits: మందార టీ హెర్బల్ టీ. ఇందులో రిలాక్సింగ్‌ గుణాలు ఉంటాయి. మందారలో ఆంథోసైనిన్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. మందార పూలను ఎండబెట్టి ఈ టీ ని తయారు చేస్తారు. ఇందులో క్రిమ్సన్ కలర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది క్రాన్బెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. ఎండకాలం ఈ టీ ఐస్డ్‌ టీ మాదిరి తీసుకోవచ్చు.  కొన్ని నివేదికల ప్రకారం మందార టీ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

యాంటీ ఆక్సిడెంట్లు..
మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ రాకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ నుంచి నివారిస్తుంది.

బీపీ తగ్గిస్తుంది..
మందార టీ ని మన డైట్లో చేర్చుకుంటే సిస్టాలిక్, డిస్టాలిక్ బ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గిస్తుందని కొన్ని నివేదికలు పరిశోధనల్లో తెలిపాయి. ఇది కొన్ని క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైనవి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..
మందార టీని తీసుకోవడం వల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయని కొన్ని నివేదికలు తెలిపాయి.

కాలేయాన్ని కాపాడుతుంది..
ప్రాథామిక పరిశోధనల ప్రకారం మందార టీ లో ఉండే హెపటోప్రొటెక్టివ్ గుణాలు కాలేయాన్ని పాడవ్వకుండా కాపాడతాయి. మన శరీరంలో పేరకున్న టాక్సిన్స్ ను ఇవి బయటకు పంపించేస్తాయి.

బరువు తగ్గిస్తుంది..
మందార ఆకులను ఎండబెట్టి తయారు చేసే మందార టీ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఫినోలిక్ కంపౌండ్స్ ఉంటాయి. మందార లోని ఆంథోసైనిన్స్ ఫ్యాట్‌ ను కట్‌ చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఇదీ చదవండి: నిమ్మకాయ రసంతో 5 ఆరోగ్య లాభాలు.. ఎండకాలం ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకవుతారు..

మూడ్..
మందార టీ డైట్లో చేర్చుకుంటే మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడతారు. ఇందులోని అరోమా స్ట్రెస్‌, యాంగ్జైటీ బారిన పడకుండా కాపాడుతుంది. ఈ కాలంలో విపరీతమైన పని ఒత్తిడి వల్ల స్ట్రెస్‌ బారిన పడుతున్నారు. ఇది వారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మందార టీ ని డైట్లో చేర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి.

మందార టీ తయారు చేసే విధానం..
రెండు కప్పుల నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల మందార పూల పొడిని వేసుకోవాలి. ఇందులోనే పుదీనా, తేనె తీసుకోవాలి. మందార పూలతో ఐస్డ్‌ టీ చేసుకుంటే ఐస్‌ క్యూబ్స్‌ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: భగ్గుముంటున్న ఎండలు.. బైటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. నిపుణుల సూచనలివే..

నీటిని వేడి చేసి అందులో మందార పూలను వేయాలి. మరుగుతున్నప్పుడు నీటి రంగు మారుతుంది.. అందులో తేనె వేస్తే తీయగా మారుతుంది. లేదా చల్లగా తీసుకోవాలంటే ఐస్‌ టాపింగ్‌ చేసుకోని నిమ్మకాయ స్లైస్‌ , పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News