Buttermilk: పెరుగుతో మజ్జిగ తయారు చేసే క్రమంలో ఇలా చేస్తే, ఈ వ్యాధులు తప్పవు..

Buttermilk Making Wrong Process: పెరుగుతో తయారు చేసిన మజ్జిగ ప్రతి రోజు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మజ్జిగ తయారు చేసే క్రమంలో తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 14, 2024, 11:37 AM IST
Buttermilk: పెరుగుతో మజ్జిగ తయారు చేసే క్రమంలో ఇలా చేస్తే, ఈ వ్యాధులు తప్పవు..

Buttermilk Making Wrong Process In Telugu: ప్రతి రోజు మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.  అయితే ఎండ కాలంలో చాలా మంది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి మజ్జిగా తాగుతూ ఉంటారు. ఇలా ప్రతి రోజు సమ్మర్‌లో తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఎండ కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే చాలా మంది మజ్జిగను తయారు చేసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తేన్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మజ్జిగ తయారు చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు సాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర వ్యాధుల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉందంటున్నారు నిపుణులు..

పెరుగులో నీటిని కలిపి మజ్జిగా చేస్తున్నారా?:
ప్రస్తుతం చాలా మంది ఇంట్లో మజ్జిగా తయారు చేసుకునే క్రమంలో పెరుగులో నీటిని కలుపుకుని కవ్వంతో చిలికి మజ్జిగను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన మజ్జిగను తాగుతున్నారు. అయితే ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. పెరుగుతో తయారు చేసిన మజ్జిగను తాగేవారు తరచుగా కొన్ని అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారట. అయితే మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలో..దాన్ని వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మజ్జిగను ఇలా తయారు చేయండి:
మజ్జిగ తయారు చేసుకోవడానికి ముందుగా వెన్నని పెరుగు నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. దీని కోసం పెరుగును కవ్వంతో బాగా చిలకాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెన్నను తీయడం వల్ల పెరుగు నీటీలా తయారవుతుంది. ఇలా తయారైన పలచని పెరుగునే మజ్జిగా ఉపయోగించవచ్చు. ఇలా తయారు చేసిన మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. 

మజ్జిగలో లభించే పోషకాలు:
మజ్జిగలో శరీరానికి అవసరమయ్యే పోషక గుణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల బాడీకి విటమిన్లు, ప్రొటీన్లు, పొటాషియం, ఫాస్పరస్, మంచి బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్, కాల్షియం అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా మజ్జిగను ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు:

పేగు సమస్యలు దూరమవుతాయి:
ప్రతి రోజు మజ్జిగతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల అందులో లభించే మంచి బ్యాక్టీరియా పేగు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు తీవ్ర పేగు సమస్యలను తొలగిచేందుకు కూడా సహాయపడుతుంది. 

అసిడిటీ నుంచి ఉపశమనం:
ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి కూడా మజ్జిగ ఔషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర అసిడిటీ సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి రోజు పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మజ్జిగను తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News