Chicken Pox Diet: శీతాకాలం ముగిసే క్రమంలో చాలా మందిలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలో అమ్మవారు(Chicken Pox) ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. వీటితో పాటు అనేక చర్మ సమస్యలు వస్తాయి. చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వివిధ రకాల ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇలా వినియోగించడం వల్ల చికెన్ గున్యా బారిన పడుతున్నారు. వరిసెల్లా వైరస్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఈ ఇన్ఫెక్షన్ గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. చికెన్ పాక్స్‌లో శరీరంపై కనిపించే చిన్న దద్దుర్లు ద్రవాన్ని నిండి ఉంటాయి. ఈ వెసిక్యులర్ దద్దుర్లు చాలా దురదగా ఉంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడేవారిలో కొన్నిసార్లు జ్వరం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి సోకితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు చికెన్ పాక్స్‌తో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
చికెన్ పాక్స్ బాధపడేవారు ఆహారాలు తీసుకోవాలి:
నీటి ఎక్కువగా తాగాలి:
చికెన్ పాక్స్‌తో బాధపడుతున్నవారు తప్పకుండా వారి శరీరాన్ని డీహైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ప్రతి రోజు అతిగా నీటిని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా చల్లని వస్తువులను తినడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
ఫాస్ట్ డైట్:
అమ్మవారు(Chicken Pox)తో బాధపడేవారు ఉదయం పూట అరటిపండ్లు, యాపిల్స్, టోస్ట్ చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీటి నుంచి మంట నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
పండ్లను తప్పకుండా తీసుకోండి:
చికెన్ పాక్స్ సమయంలో ఎక్కువ పండ్లు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ద్రాక్ష, అరటిపండ్లు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ సమస్యతో బాధపడేవారు మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లను తీసుకోవడం కూడా చాలా మంచిది.
Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
ఉడికించిన కూరగాయలు:
చికెన్ పాక్స్‌తో బాధపడేవారు ఉడికించిన కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది. క్యారెట్లు, చిలగడదుంపలు, బంగాళదుంపలు, క్యాబేజీని ఉడికించి తీసుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
పెరుగు:
చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు పెరుగు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి చికెన్ పాక్స్ ప్రతి రోజు తీసుకోవడం వాటి నుంచి వచ్చే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
యాంటీ వైరల్ కలిగిన ఆహారాలు:
చికెన్ పాక్స్‌తో బాధపడేవారు పెరుగు, ఖర్జూరం, ఆప్రికాట్లు, చెర్రీస్, అవకాడో తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వైరస్‌ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter