High Cholesterol: కొలెస్ట్రాల్‌ను కేవలం 30 రోజుల్లో తగ్గించే పది అద్భుత పదార్ధాలివే

High Cholesterol: కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే..జీవనశైలి మారాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాలు డైట్‌లో చేర్చుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 16, 2022, 04:35 PM IST
High Cholesterol: కొలెస్ట్రాల్‌ను కేవలం 30 రోజుల్లో తగ్గించే పది అద్భుత పదార్ధాలివే

సంపూర్ణ ఆరోగ్యానికి ఆటంకం కొలెస్ట్రాల్. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆవకాడో నుంచి నట్స్ వరకూ పదిరకాల పదార్ధాలతో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గుండెపోటు, స్ట్రోక్ సమస్యలు పెరగడానికి కొలెస్ట్రాల్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మూడవ గుండెపోటు కేసుకు కారణం అధిక కొలెస్ట్రాల్ అని తెలుస్తోంది. 2008లో పెద్దవారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ 39 శాతం పెరిగినట్టు అంచనా. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు డైట్, జీవనశైలి ఈ రెండూ కీలకపాత్ర పోషిస్తాయి. డైట్ విషయంలో పదిరకాల పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి.

తృణ ధాన్యాలు

ఓట్స్, బార్లీ వంటివాటిలో బీటా గ్లూకోన్‌గా పిల్చుకునే సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తుంది. రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

నట్స్

బాదాం, పీనట్స్, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా..ట్రైగ్లిసరాయిడ్స్ తగ్గించేందుకు, రక్తపోటు తగ్గించేందుకు ఇవి దోహదపడతాయి.

లెగ్యూమ్స్

ఇక కొలెస్ట్రాల్‌ను తగ్గించే మరో పదార్ధం పల్సెస్. వీటిలో ఫైబర్, మినరల్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి..మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

సోయాబీన్స్

సోయాబీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్లుల ఎక్కువగా ఉండటంతో కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.

కూరగాయలు

బెండకాయ, బీన్స్ వంటి డార్క్ గ్రీనీ వెజిటబుల్స్‌ లో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించేందుకు దోహదపడతాయి.

పండ్లు

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. బెర్రీస్ ప్రత్యేకంగా ఈ సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి.

ఫ్యాటీ ఫిష్

మ్యాకెరాల్, సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 4 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా గుండెపోటు ముప్పు తగ్గుతుంది.కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది.

ఆవకాడో

ఇవి ఆరోగ్యకరమైన, న్యూట్రియంట్ కలిగిన ఫ్రూట్. ఇందులో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్ అనే పదార్ధం ఎల్ డీఎల్ తగ్గించేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది. అందుకే వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

డార్క్ చాకొలేట్

ఇందులో కోకోవా పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎల్‌డీఎల్ తగ్గించి..రక్తపోటును నియంత్రిస్తాయి. 

Also read: Nerves Weakness Home Remedie: నరాల బలహీనతకు అద్భుతమైన చిట్కాల్లో ఇది ఒకటి.. దీనితో 12 రోజుల్లో నొప్పులు మాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News